»   » అనుభవించిన నరకం అంతాఇంతా కాదు: షీలా

అనుభవించిన నరకం అంతాఇంతా కాదు: షీలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ తో అదుర్స్ చిత్రంలో చేసిన షీలా తన ప్రారంభం రోజుల్ని తలుచుకుంటూ రీసెంట్ గా మీడియాతో మాట్లాడింది. ఆమె మాటల్లోనే...'సీతాకోక చిలుక' చేస్తున్న రోజుల్లో నేను అనుభవించిన నరకం అంతాఇంతా కాదు. డైలాగ్‌లు తెలుగులో చెప్పలేకపోయాను. దాంతో స్పాట్‌లో ఉన్నవాళ్లందరూ నా వంక చూసి పగలపడి నవ్వారు. ఆ రోజుని నేను పడ్డ స్ట్రగుల్స్‌ మర్చిపోలేను. దాన్ని ఘోరమైన అవమానంగా భావించాను పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నాను. ఇప్పటికీ నాకా సంఘటన గుర్తొస్తూనే ఉంటుంది. మనిషి ఏదైనా సాధించాలని దృఢంగా నిశ్చయించుకుంటే తప్పక సాధిస్తాడని నా నమ్మకం. నా విషయంలో అదే జరిగింది. ఏ విషయంలోనైనా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని కోరుకున్నాను. ఆ అనుభవం నుంచే ఈ అందం, చురుకుదనం పుట్టుకొచ్చాయి అంటోందామే. మస్కా, హలో ప్రేమిస్తారా అంటూ సినిమాలు చేసినా రాని గుర్తింపు అదుర్స్ తో రావటంతో ఆమె చాలా హ్యాపీగా ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu