»   » నేనేంటో నాకు తెలుసు అందుకే... : తాప్సీ

నేనేంటో నాకు తెలుసు అందుకే... : తాప్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :''నన్ను పోలిన పాత్రలో మాత్రం నటించను. ఎందుకంటే... సమాజంలో వివిధ వృత్తులు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. వారి జీవితాల్లోకి తొంగి చూడాలనిపిస్తుంటుంది. నేనేంటో నాకు తెలుసు. మళ్లీ నన్ను పోలిన పాత్రలో నటించడం ఇష్టం ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు భిన్నమైన పాత్రలు పోషించే ప్రయత్నం చేస్తుంటాను. మూడు భాషల్లో నటిస్తున్నాను. అవకాశాల పరిధి విస్తృతమైంది. ఎక్కడ మంచి పాత్ర దొరికితే అక్కడ నటిస్తాను''అని చెప్పుకొచ్చింది తాప్సీ.

ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు, తమిళంలో రూపొందుతున్న 'ముని 3'లో నటిస్తోంది. తమిళంలో 'ఆరంభమ్‌' అనే మరో సినిమా చేస్తోంది. ఎలాంటి పాత్రల్లో నటించడం మీకు ఇష్టం అని తాప్సిని అడిగితే... పై విధంగా స్పందించింది. అలాగే ''కోరిన కోరికలు తీరితే ఎవరికైనా ఆనందమే. అయితే సినిమా పాత్రల విషయంలో మాత్రం నాకు కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలున్నాయి. నేను కోరుకొన్న పాత్రలు నాకు దక్కితే అంత ఆనందమేమీ ఉండదు. అదే... ఒక పాత్ర నన్ను ఎంచుకొందని తెలిసినప్పుడే ఎక్కువ ఆనందానికి గురవుతుంటాను'' అని చెబుతోంది తాప్సి.

ఇక తనకు మరో హిందీ చిత్రంలో నటించడానికి అవకాశం వచ్చిందని తాప్సీ ఒప్పుకుంటున్నప్పటికీ వివరాలు వెల్లడించడానికి మాత్రం సుముఖంగా లేదు. తనకు ఈ సినిమా స్క్రిప్టు ఎంతగానో నచ్చిందని, సత్తా ఉన్న బృందంతో పనిచేసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని మాత్రం అంటుంది. తన పాత్ర కూడా కథలో ఒక భాగంగా ఉండాలని ఆశించానని, అలాంటి చిత్రంలో నటించే అవకాశం తనకు ఇంత తొందరగా వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్తోంది తాప్సీ.


తెలుగులో 'సాహసం' చిత్రంలో తాప్సీ చేసిన శ్రీనిధి పాత్రకు ఎంతో పేరు వచ్చింది. ఈ మధ్య మంచు లక్ష్మీప్రసన్న నిర్మించిన 'గుండెల్లో గోదారి'లో నెగటివ్ టచ్ ఉన్న సరళ పాత్రను చక్కగా పోషించి విమర్శకుల ప్రశంసలందుకున్న ఢిల్లీ సుందరి తాప్సీ తాజాగా అదే తరహా అభినందనలు అందుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో ఆర్య సరసన 'వాలై', లారెన్స్ సరసన 'ముని 3' సినిమాలు చేస్తోంది తాప్సీ .


'కాంచన' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత మళ్లీ దర్శకుడు రాఘవ లారెన్స్, నిర్మాత బెల్లంకొండ సురేష్ కాంబినేషన్లో 'ముని-3' భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసందే. లారెన్స్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించే 'ముని-3'లో తాప్సీ హీరోయిన్. ఈ సినిమా కోసం తాప్సీ ఎలాంటి రిస్క్ సీన్లయినా చేయడానికి సై అంటోంది. భయం అనేదే లేకుండా తెగింపుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం చెన్నైలో ఈమెపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తీస్తున్నారు. ఓ సీన్ కోసం 12గంటలు నీళ్ళలో గడిపింది.

English summary
Tapsee is on cloud nine. she has signed one more bolly flick now. Tapsee had a successful bollywood debut with Chasme Baddoor. Chasme Baddoor not just became a superhit but also grabbed Hindi film industry’s attention towards Tapsee. Though Tapsee has confirmed the news of her second bollywood film she said she cannot disclose other details due to contractual obligations. But one thing she revealed is that the movie will feature a new hero.
Please Wait while comments are loading...