twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాల్లోకి నాగార్జున? వైఎస్ జగన్‌తో భేటీ అందుకేనా?

    |

    సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. సినిమా రంగం నుంచి పలువురు స్టార్స్ ఆయా పార్టీల తరుపున పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, మరికొందరు ప్రచారం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

    ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని.. అక్కినేని నాగార్జున మంగళవారం కలవడం చర్చనీయాంశం అయింది. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్-నాగార్జున భేటీ జరిగింది. దీంతో నాగ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

    వైసీపీలో చేరుతున్నారా?

    వైసీపీలో చేరుతున్నారా?

    అక్కినేని నాగార్జున ముందు నుంచీ రాజకీయాలకు అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. అయితే కొన్ని రోజులుగా ఆయన వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వీరి భేటీ హాట్ టాపిక్ అయింది.

    రాజకీయాల్లోకి నాగార్జున?

    రాజకీయాల్లోకి నాగార్జున?

    నాగార్జున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. నాగార్జున గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీలో దిగే అవకాశం ఉందని వార్తలు సైతం వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    రాజ్య సభ సీటు?

    రాజ్య సభ సీటు?

    అయితే నాగార్జునకు రాజకీయాల్లో నెగ్గుకొచ్చే చతురత లేదని, ఆయన్ను రాజ్యసభ్యకు పంపే అవకాశం ఉందనే ప్రచారం సైతం వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంత అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

    సుమంత్ ద్వారా పరిచయం

    సుమంత్ ద్వారా పరిచయం

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నాగార్జున మేనల్లుడు సుమంత్ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటి నుంచే మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. సుమంత ద్వారానే వీరి మధ్య పరిచయం ఏర్పడినట్లు సమాచారం.

    English summary
    Tollywood actor Nagarjuna met YCP President YS Jaganmohan Reddy on Tuesday. Speculation is that, Nagarjuna is coming to politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X