For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'రెబెల్' కు పోటీగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ రిలీజ్

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రభాస్ తాజా చిత్రం 'రెబెల్' ఈ నెల 28న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పోటీగా అదే రోజు ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మరో చిత్రం రిలీజ్ అవుతోంది. ఆ చిత్రం మరేదో కాదు.... 'హౌస్‌ఫుల్‌'. నాగచైతన్యతో రూపొందించిన 'దడ' చిత్రం తో పరిచయమైన దర్శకుడు అజయ్ భయాన్. ఈ దర్శకుడు తన దడ కమిట్ కాకముందే ఓ చిత్రం రూపొందించారు. ఆ చిత్రం టైటిల్ 'హౌస్‌ఫుల్‌'. 'హౌస్‌ఫుల్‌' చిత్రం చూసి ఇంప్రెస్ అయ్యే నాగార్జున తన కుమారుడుతో దడ చిత్రం రూపొందించమని ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడా చిత్రం విడుదలకు సిద్దమైంది. ఎప్పుడో షూటింగ్ పూర్తైనా ఇన్నాళ్లూ ఆ చిత్రం బిజినెస్ కాకపోవటంతో విడుదలకు నోచుకోలేదు. ఇన్నాళ్ళకు ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  'హౌస్‌ఫుల్‌' చిత్రాన్ని ఆ నలుగురు వంటి చిత్రాలు డైరక్ట్ చేసిన చంద్రసిద్ధార్థ్‌ సమర్పిస్తున్నారు. నిఖిత క్రియేషన్స్‌ పతాకంపై ప్రఖ్యాత దర్శకుడు చంద్ర సిద్దార్థ సమర్పణలో అజయ్ భుయాన్‌ దర్శ కత్వంలో సదాశివ యాదవ్‌ నిర్మించిన చిత్రం 'హౌస్‌ఫుల్‌. విడుదల సందర్భంగా చంద్రసిద్దార్థ మాట్లా డుతూ ''మొదటి ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తేనే.. మరిన్ని కొత్త ప్రయోగాలు చేసే ధైర్యం దర్శకుడికి వస్తుంది. ఆ కోవలోనే అజయ్ భుయాన్‌ ఓ ప్రయోగం చేశాడు. నవీన పంథాలో నవతరానికి నచ్చే 'హౌస్‌ఫుల్‌ను మన ముందుకు తెస్తున్నాడు. ఓ హిందీ సినిమా చేస్తూనే భుయాన్‌ ఈ సినిమా తెరకెక్కించాడుఅని అన్నారు.

  అజయ్ భుయాన్‌ మాట్లా డుతూ ''ఇది నా తొలి సినిమా. కొత్తగా అనిపించే స్క్రీన్ ప్లేతో తీశాను. ప్రేమ, క్రైమ్‌, సస్పెన్స్‌..ఈ మూడింటిని మూడు పాత్రల ద్వారా వ్యక్త పరిచాం. పజిల్‌ లాంటి ఇంటెలెక్చువల్‌ కథాంశమిది అని తెలిపారు. హీరో ఆర్యన్‌ మాట్లా డుతూ ''కొత్తలోకం లోకి తీసుకెళ్లే చిత్రమిది. గాళ్‌ఫ్రెండ్‌, స్నేహితులతో చూస్తే మజాగా ఉంటుందిఅని చెప్పారు. గౌరీ పండిట్‌, వేగ, అలీ, జీవా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జ్ఞాన శేఖర్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, పాటలు: చైతన్యప్రసాద్‌, అనంత శ్రీరాం, పెద్దాడమూర్తి.

  ఇక అజయ్ భుయాన్ కి దడ చిత్రం తర్వాత ఏ ఆఫరూ రాలేదు. దాంతో ఆయన హిందీకి వెళ్లిపోయారు. డిల్లీ బెల్లి ఫేమ్ వీరదాస్ ప్రధానపాత్రలో ఆయన ఓ చిత్రం రూపొందిస్తున్నారు. ఈరోస్ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ విషయమై అజయ్ భుయాన్...తన కథ విన్న వెంటనే నిర్మాతలు ఆసక్తిగా చేయటానికి ఓకే చేసారని అన్నారు. ఈ హిందీ చిత్రం ఈ సంవత్సరంలోనే విడుదల కానుంది. దాన్ని తెలుగులోకి సైతం డబ్బింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

  English summary
  RR Distributors (distribution wing of RR Moviemakers) have taken the responsibility of Housefull and are going to release the movie on 28 September irrespective of the release of Rebel on the same day. This film is directed Ajay Bhuyan and produced by Chandra Siddharth. Anup Rubens composed music. This is a romantic comedy with Rashomon kind of ‘points of view’ orientation.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X