»   » హాలీవుడ్‌ సినిమాలకు చుక్కలు చూపించిన బాహుబలి-2 (వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం:)

హాలీవుడ్‌ సినిమాలకు చుక్కలు చూపించిన బాహుబలి-2 (వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం:)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్రముఖ అమెరికన్ మేగజైన్ 'వాల్ స్ట్రీట్ జర్నల్' లో బాహుబలి-2 గురించి వచ్చిన కథనం బాహుబలి మూవీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'హౌ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ బీట్ హాలీవుడ్ కాంపిటీటర్స్' పేరుతో వచ్చిన కథనం.... ఇండియన్ ప్రేక్షకుల్లో మరింత ఉత్తేజాన్ని నింపించింది.

రూ. 1000 కోట్ల వసూళ్లతో ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా చరిత్ర సృష్టించిన ఈ చిత్రం.... యూఎస్ఏ మార్కెట్లోనూ తన సత్తా చాటింది. పలు హాలీవుడ్ సినిమాలకు చుక్కులు చూపించింది అని ప్రశంసిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది.


ఓపెనింగ్ వీకెండ్ రికార్డ్

ఓపెనింగ్ వీకెండ్ రికార్డ్

ఏప్రిల్ 28 ఓపెనింగ్ వీకెండ్ $10.3 మిలియన్ డాలర్లు వసూలు చేసి.... అమెరికాలో నెం.3 ఫిల్మ్‌ గా నిలిచిందని అని ‘వాల్ స్ట్రీట్ జర్నల్' తన కథంలో పేర్కొంది.


ఆ సినిమాలను బీట్ చేసింది

ఆ సినిమాలను బీట్ చేసింది

హాలీవుడ్ సినిమాలైన ‘ది బాస్ బేబీ', ‘ది సర్కిల్'తో పాటు ఇతర హాలీవుడ్ సినిమాలను ‘బాహుబలి-2' వీకెండ్ కలెక్షన్ల పరంగా బీట్ చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది.


భారీ యావరేజ్

భారీ యావరేజ్

బాహుబలి-2 మూవీ కేవలం అమెరికా వ్యాప్తంగా కేవలం 425 స్క్రీన్లలో విడుదలై...... ఫస్ట్ వీకెండ్ ఒక్కో స్క్రీన్ కు యావరేజ్ గా $24,364 వసూలు చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. అదే వీకెండ్ నెం.1 ఫిల్మ్ గా ఉన్న ‘పాస్ట్ అండ్ ఫ్యూరియస్' 4,077 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ ఒక్కో స్క్రీన్ కు యావరేజ్ గా $4,890 మాత్రమే వసూలు చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం.


బాహుబలి-2 చరిత్ర

బాహుబలి-2 చరిత్ర

ఇండియన్ సినీ పరిశ్రమలో రూ. 1000 కోట్లతో చరిత్ర సృష్టించిన ‘బాహుబలి-2' అమెరికాలో కూడా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ఏలో రూ. 100 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ రూ. 100 కోట్లు వసూలు చేసిన తొలి ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం.


English summary
‘Baahubali 2: The Conclusion’ is the highest-grossing Indian film in history. In the U.S., it beat ‘The Boss Baby,’ ’The Circle’ and other Hollywood fare.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu