»   » కరెక్టే కానీ..మణిరత్నంని ఎలా ప్రశ్నిస్తాం

కరెక్టే కానీ..మణిరత్నంని ఎలా ప్రశ్నిస్తాం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను రావణ చూసి స్టన్నయ్యాను. నేను స్పిరుట్వల్ గా కనెక్ట్ కాలేకపోయాను. మరీ కమర్షియల్ గా తీసారు. ఒరిజనల్ రామాయణంలో ఉన్న బాలెన్స్ ఇందులో లేదు. ఎమోషనల్ గా గానీ ఆధ్యాత్మికపరంగా గానీ రామాయణం వంటి గొప్ప కావ్యంతో పోల్చలేం. అయితే మణిరత్నం తో ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. అంత పెద్ద దర్శుకుడుని ప్రశ్నించలేము కదా అంటున్నారు గోవింద్ నిరాశనిండిన హృదయంతో. ఆయన తాజాగా రావణ్ లో హనుమంతుడు తరహా పారెస్ట్ గార్డు పాత్రను వేసారు. అయితే మణిరత్నం నుంచి చాలా నేర్చుకున్నానని, ఆయన వర్కింగ్ స్టైల్ గొప్పదని అంటున్నారు.

ఇక రావణ్ స్క్రిప్టు చదవలేదని, ఒక్క సారి ఆ క్యారెక్టర్ చేయటానకి నిర్ణయం తీసుకున్నాక ఆ పాత్ర ఏమిటన్నది కూడా ఆడగలేదు. మణిసార్ ఏమి ఎలా చెప్పారో అలాగే చేసాను. ఇక మణిరత్నం ఈ చిత్రాన్ని రామాయణం గా చేయటం లేదని రావణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి తీస్తున్నారని తెలుసుకుని సైన్ చేసాను. ఇక నా పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఉందా లేదని ఆలోచించకుండా మణిరత్నం చిత్రంలో చేయాలి అని ఒప్పుకున్నాను. అయినా నేను ఇప్పటికీ 148 చిత్రాలు చేసాను.

నా ఇన్నేళ్ళ కెరీర్ లో ఎప్పుడూ కూడా నా పాత్ర ఏమిటి,దర్శకుడుకి ఏమి కావాలి అనే విషయాలు తప్ప మిగతాది ఏదీ పట్టించుకోలేదు. అది ఓ రకంగా సెల్ప్ డిఫెన్స్ మెకానిజమ్. చాలా ఏళ్ళుగా దాన్ని నేను ఎడాప్ట్ చేసుకుని అవలంబిస్తున్నాను. రావణ్ కీ అదే అవలింబించాను. కాబట్టి ఈ సినిమా గురించి ఆ షూటింగ్ అయిపోగానే మర్చిపోయాను. మరో షూటింగ్ లో లీనమయ్యే ప్రాసెస్ లో ఉన్నాను అని గోవిందా చెప్పుకొచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu