»   » పూరీ జగన్నాధ్ 'గోలీమార్' ఎలా ఉండబోతోంది?

పూరీ జగన్నాధ్ 'గోలీమార్' ఎలా ఉండబోతోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ వారంలో రిలీజ్ కానున్న గోపీచంద్ 'గోలీమార్' పైనే అందరి కళ్ళూ ఉన్నాయి. ఎందుకంటే వరస ఫ్లాఫుల్లో ఉన్న పూరీ జగన్నాధ్, గోపీచంద్, ప్రియమణి ముగ్గురికీ ఈ చిత్రం కీలకం కాబోతోంది. అందులోనూ ఈ చిత్రం యావరేజ్ అంటూ ఓ రూమర్ అప్పుడే పరిశ్రమ వర్గాల నుండి బయిలుదేరింది. ఎంటర్టైన్మెంట్ బాగా తక్కువగా ఉందని కేవలం క్యారక్టైరేజషన్ నమ్మి పూరీ ఈ చిత్రం తెరకెక్కించాడని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది.

నిజానికి దయానాయక్ జీవితం చాలా సినిమాటెక్ లాంటి సంఘటనలతో నిండి ఉంది. కర్నాటకలో పుట్టిన దయానాయక్ ముంబయి చేరుకుని ఓ ఉడిపి రెస్టారెంట్ లో పనిచేస్తూ చదువుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ ఎస్సై గా జాయిన్ అయి స్ట్రీట్ ఫైట్ లో ఇద్దరు గ్యాంగస్టర్స్ ని చంపటంతో అతను వెనక్కి తిరగాల్సిన అవసరం రాలేదు. ఆయన ఓపెన్ గా ఇప్పటికి ఎనభై ముగ్గురు గ్యాంగస్టర్స్ ని ఎనకౌంటర్ చేసి చంపానని చెప్తూంటారు. ఇక పూరీ గురువు రామ్ గోపాల్ వర్మ ఇంతకు ముందు ఆయన బ్యానర్ లో నిర్మించిన అబ్ తక్ చప్పన్ కూడా దయానాయక్ జీవిత సంఘటనలతో తయారైంది.

ఆ చిత్రాన్ని జేడీ చక్రవర్తి తెలుగులోకి జగపతిబాబుతో సిద్దం టైటిల్ తో అనువాదం తరహాలో డైరక్ట్ చేసి అందించారు. అలాగే చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రారంభమై కంటెన్యూ షెడ్యూల్ తో షూటింగ్ జరిగింది. అలాగే ప్రియమణి రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న రక్త చరిత్ర చిత్రంలోనూ చేస్తోంది. అలాగే పూరీ కూడా రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా సూర్య హీరోగా ది బిజెనెస్ మెన్ అనే టైటిల్ ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తునన్నారు. గోపీచంద్ నెక్ట్స్ బి.గోపాల్ దర్శకత్వంలో చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu