twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' పైరసీ నుంచి ఎలా తప్పుకుందంటే...

    By Srikanya
    |

    హైదరాబాద్: "పైరసీని అరికట్టడంలో మా వంతు కృషి మేం చేశాం. ప్రేక్షకులు కూడా దొంగ సీడీలను చూడకుండా సహకరించాలి. మా 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' చిత్రానికి పైరసీని అరికట్టడంలో ఎంటర్‌సాఫ్ట్ సంస్థ అత్యుత్తమంగా పనిచేసింది. ఈ రోజుల్లో విడుదలైన చిత్రానికి రెండు వారాలపాటు పైరసీ రాకుండా చేయడం గొప్ప విషయం. ఆన్‌లైన్‌లో పైరసీలను ప్రదర్శించే 150కి పైగా పోర్టళ్ళకు ఈ సంస్థ చెక్ పెట్టడం విశేషం. పైరసీ ప్రపంచవ్యాప్తంగా సృజనకారులకు తలనొప్పిగా మారింది'' అని ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల అన్నారు.

    ''నటీనటులు కొత్తవాళ్త్లెనా సినిమా బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ విషయం 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'తో మరోసారి రుజువైంది. మాకు ఇంత పెద్ద విజయం దక్కినందుకు ఆనందంగా ఉంది'' అన్నారు శేఖర్‌ కమ్ముల. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. అలాగే ''ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇది మన సినిమా అని నిరూపించారు. వసూళ్లు బాగా ఉన్నాయి. యూఎస్‌లో అయితే 50-60 సెంటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది.'' అని శేఖర్ కమ్ముల చెప్పారు.

    అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్‌లను తెరకు పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. సెప్టెంబర్ 14న విడుదల అయిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు ఈ చిత్రాన్ని ట్రిమ్ చేసారు శేఖర్ కమ్ముల. అయితే వీకెండ్ లో మంచి బిజినెస్సే చేస్తోంది. ఇప్పటికీ మల్టిప్లెక్స్ లలో వసూళ్లు బాగున్నట్లు చెప్తున్నారు.

    అమిగోస్‌ క్రియేషన్స్‌ పతాకంపెై చంద్రశేఖర్‌ కమ్ముల- శేఖర్‌ కమ్ముల సంయుక్తంగా నిర్మించారు. చిత్రంలో శ్రియ, అమల, అంజలా జవేరి వంటి సీనియర్ హీరోయిన్స్ చేసారు. సినిమా గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ''నా చిన్ననాటి నవ్వు, అమాయకత్వం, ఓల్డ్‌ స్టైల్‌ అన్నీ తెరకెక్కించే ముందు సిద్ధం చేసేందుకే 6నెలలు పట్టింది. లవ్‌, రొమాన్స్‌, అల్లరి, సెంటిమెంట్‌ అన్నీ ఉన్న ఆహ్లదకర సినిమా చేశాను. పేద్ద పేరొస్తుందని అమాయకత్వంతో తీశాను'' అన్నారు. అప్పుడు హ్యాపీడేస్‌ కాలేజీలో.. ఇప్పుడు హ్యాపీడేస్‌ కాలనీలో! ఇది నా చిన్నతనం లాంటి సినిమా. అమాయకం.. ఆహ్లదం.. అందమైన నవ్వు... అనుభూతి.... ఇలా ఎన్నిటినో తెరపరిచాను ఈసారి'' అన్నారు శేఖర్‌ కమ్ముల.

    English summary
    Sekhar Kammula utilized the services of a software company Enter soft to prevent the 'Life is Beautiful' piracy. The software apparently guarantees that there would be no piracy online too for at least two weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X