twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యభిచారం నడిపినట్లే చేసారు: మీడియాపై హీరోయిన్ ఫైర్

    By Bojja Kumar
    |

    Deepti Naval
    ముంబై: ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, నటి దీప్తి నావల్ మీడియా తీరుపై మండి పడ్డారు. ఈ మేరకు తన ఫేస్ బుక్, ట్విట్టర్లలో మీడియా వారిని కడిగేస్తూ ఆమె ఓ పెద్ద ఆర్టికల్ పోస్ట్ చేసారు. తాను వ్యభిచార రాకెట్ నడపకున్నా...నడిపినట్లుగా పరిస్థితులు సృష్టించారని, తన గురించి అంతా నానా రకాలుగా మాట్లాడుకునేలా చేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్కడ జరిగింది ఒకటైతే మీడియా అత్యుత్సాహంతో అసలు విషయం మరుగున పడి, జరగని విషయమే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చిందని, వ్యభిచారం అనే పదం వినిపిస్తే చాలు మీడియా దాన్ని సెన్సేషన్ చేసి లేని పోని ఊహాగానాలకు కారణం అవుతోందని ఫైర్ అయ్యారు.

    అసలు జరిగింది ఏమిటంటే...
    దీప్తి నావల్ నటించిన 'లిజన్ అమాయా' అనే హిందీ చిత్రం విడుదలకు కొన్ని రోజుల ముందు ఆ చిత్రంలో నటించిన దీప్తి నావెల్, ఫరూక్ షేర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ముంబైలోని ఆమె నివాసంలో రాజీవ్ మసంద్ అనే వ్యక్తికి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకన్నారు. ఈ మేరకు రాజీవ్ మసంద్ తన ముగ్గురు కెమెరా మేన్ల టీంతో పాటు ఆమె నివాసానికి చేరుకున్నారు.

    అయితే ఆమె నివాసం ఉంటున్న హౌసింగ్ సొసైటీ వారు ఇక్కడ సినిమా షూటింగులు చేయవద్దని ఆమెతో గొడవకు దిగారు. అయితే ఇది సినిమా షూటింగ్ కాదని, ఇంటర్వ్యూ మాత్రమే అని ఆమె వారికి చెప్పినా వినలేదు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెరిగి సొసైటీ వారు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది వ్యవహారం.

    ఆ తర్వాత ఆమె తన జర్నలిస్టు స్నేహితుడికి జరిగిన గొడవ గురించి ఫోన్లో తెలియజేసింది. నేనేదో వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు హౌసింగ్ సొసైటీ వారు నా పట్ల అమర్యాదగా ప్రవర్తించారని జర్నలిస్టుకు తెలియజేసింది. దీంతో సదరు జర్నలిస్టు 'నేను వ్యభిచార రాకెట్ నడపటం లేదు' అనే టైటిల్ తో జరిగిన విషయాన్ని ఆమె మాట్లల్లో వార్తలా పబ్లిష్ చేసారు.

    ఆ తర్వాత ఇతర మీడియా సంస్థల వారు ఇదే అంశానికి తమ సొంత కవిత్వం జోడించి వేరే రకంగా ఎక్స్ ఫోజ్ చేయడం ప్రారంభించారు. పరిస్థితి ఎలా తయారైందంటే దీప్తి నావెల్‌‌పై వ్యభిచార రాకెట్ నడిపిన ఆరోపణలు వచ్చినట్లు, ఆమె దాన్ని ఖండించినట్లు అనే రితీలో అసలు విషయాన్ని తప్పుతోవ పట్టించారు.

    మీడియా తీరుపై మనస్థాపం చెందిన దీప్తి నావల్ జరిగిన విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మీడియా వారికి సినీతారలు, వ్యభిచారం అనే అంశాలంటే మహా మక్కువ. ఈ రెండు అంశాలు వారి చేతికి దొరికితే దాన్నో సెన్సేషన్ చేస్తారు, వారికి వాస్తవాలు అక్కరలేదు అంటూ ఘాటుగా విమర్శించారు.

    English summary
    Veteran Bollywood actress Deepti Naval is miffed with media for sensationalising and writing articles based on her conversation with a journalist friend. She has slammed media's attitude towards "sensationalising" issue to grab eye-balls. Naval vented her anger against media on Facebook and Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X