»   » అరే..అవన్ని గ్రాఫిక్స్ యేనా :'సుల్తాన్' లో గ్రాఫిక్స్ ...చూస్తే షాక్ అవుతారు(వీడియో)

అరే..అవన్ని గ్రాఫిక్స్ యేనా :'సుల్తాన్' లో గ్రాఫిక్స్ ...చూస్తే షాక్ అవుతారు(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ రోజుల్లో విఎఫ్ ఎక్స్ అనేది సినిమాల్లో అతి ముఖ్యమైన అంశం. సినిమాల్లో విఎఫ్ ఎక్స్ కోసం ప్రత్యేకమైన బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. రీసెంట్ గా విడుదలై ఘన విజయం సాధించిన సుల్తాన్ చిత్రం లోనూ విఎఫ్ ఎక్స్ కు సైతం ప్రత్యేకమైన స్దానం లభించింది. సినిమాలో చాలా సీన్స్ ని విఎఫ్ ఎక్స్ లేపి నిలబెట్టాయి. సుల్తాన్ లోని విఎఫ్ ఎక్స్ కు సంభిందించిన వీడియోని మీరు ఇక్కడ చూసి ఎంజాయ్ చేయండి.

సుల్తాన్‌ సల్మాన్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ చిత్రం కోసం బాగానే కష్టపడ్డాడు. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి ఆలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు. సల్మాన్‌ఖాన్‌ రెజ్లింగ్‌ కోచ్‌గా రణదీప్‌ హూడా నటించాడు. ఇందులో సల్మాన్‌ హర్యానా మల్లయోధుడు కేసరి సుల్తాన్‌ పాత్రను ధరించిన విషయం తెలిసిందే. హాలీవుడ్‌ మల్లయోధుడు టైరాన్‌ వూడ్లీ సల్మాన్‌కు మల్లయుద్ధంలో శిక్షణ ఇచ్చాడు. హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో సిల్విస్టర్‌ స్టాలోన్‌ను అనుకరిస్తూ సల్మాన్‌ పాత్ర వుంది అని విమర్శలు వచ్చినా సినిమాకు బాగా ప్రశంసలు వచ్చాయి.

How VFX worked wonders for Salman Khan’s blockbuster Sultan!

ఈ సినిమా కోసం ముంబై గోరెగామ్‌లో ఉన్న ఫిలింసిటీలో ఒక పెద్ద రాజభవనం సెట్టింగ్‌ నిర్మించి మరీ షూట్ చేసారు హీరోయిన్‌ పాత్రకి మొదట్లో హీరోయిన్‌గా దీపికా పదుకొణే, తరవాత పరిణీతి చోప్రా, కృతిసనన్‌ పేర్లు వినపడినా కుదర్లేదు. ఇప్పుడు కొత్త తార మృనాల్‌ ఠాకూర్‌ నాయికాగా నటించవచ్చంటున్నారు. కానీ ఫైనల్ గా అనుష్క శర్మ సీన్ లోకి వచ్చి అదరకొట్టింది.

ఈద్ పండుగకు రెండు రోజుల ముందే 'సుల్తాన్' తెరపైకి దూసుకొచ్చి, విజయ విహారం చేసింది. ఈ చిత్రం వసూళ్లు ఇప్పుడో సంచలనం. అయిదురోజులకే వచ్చేసిన ఖర్చు. విడుదలైన తొలి ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 180 కోట్ల రూపాయలు వసూలు చేయడం గురించి ఇప్పుడు అందరూ చెప్పుకున్నారు. ఈ చిత్ర నిర్మాణ వ్యయం దాదాపు 90 కోట్ల రూపాయలని భోగట్టా. కాబట్టి, రిలీజైన బుధవారం నుంచి ఆదివారం దాకా తొలి వారాంతంలోనే బడ్జెట్‌కు రెండింతలు వసూలు చేసిందని హిందీ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సల్మాన్ మల్ల యోధుడిగా కనిపించిన విషయం తెలిసే ఉంటుంది. దీని కోసం బరువు పెరిగి, తగ్గి.. ఇలా రెండు రకాలుగా సల్మాన్ కనిపించి, ఆకట్టుకున్నారు. ఆ శ్రమకు తగ్గ ఫలితమే దక్కింది. మామూలుగా వీకెండ్ వసూళ్లు రాబట్టుకోవడానికి శుక్రవారం సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ఒక్కోసారి అటూ ఇటూ అవుతుంది.

అలాగే, పవిత్ర ఉపవాస దినాలన్నీ అయిపోతాయి కాబట్టి, సర్వసాధారణంగా రంజాన్ పండగ రోజునే సినిమా రిలీజ్ కూడా జరిగేలా చూస్తారు. కానీ, సల్మాన్ 'సుల్తాన్' రెండు రోజుల ముందే వచ్చింది.రంజాన్‌ను టార్గెట్ చేసి, 6న రిలీజ్ చేశారు. ఈసారి రంజాన్ ఒక రోజు ఆలస్యమై, 8న రావడం కూడా సినిమాకు బాగా ఉపయోగప డింది. ఆ తర్వాత వారాంతం. దాంతో మంచి వసూళ్లు రాబట్ట గలిగింది.

English summary
Sultan’ was the biggest hit of the year and while Salman Khan and Anushka Sharma deserve credit for the success, a crucial component that also deserved some credit was the VFX technology that enhanced the visuals of the scenes.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu