»   » హృతిక్ కళ్లకు గంతలు కట్టుకొని ఏం చేశాడంటే..

హృతిక్ కళ్లకు గంతలు కట్టుకొని ఏం చేశాడంటే..

Posted By: Rajababu
Subscribe to Filmibeat Telugu

'కహోనా ప్యార్ హై'అంటూ తొలి చిత్రంతోనే యువతను, మహిళలనూ ఉర్రూతలూగించిన హృతిక్ రోషన్ గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేకుండా పోవడం, కంగనా రనౌత్ తో వివాదం లాంటి అంశాలు ఆయనను డిఫెన్స్ లో పడేశాయి. మొహంజదారో చిత్రంతో హిట్ కొట్టి మళ్లీ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని తహతహలాడిన ఆయనకు ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో నిరాశే మిగిలింది.

Hrithik

ఈ నేపథ్యంలో బుధవారం విడుదల కానున్న కాబిల్ పైనే హృతిక్ ఆశలన్నీ ఉన్నాయి. ఈ చిత్రంలో అంధుడి పాత్రలో నటిస్తూ మరోసారి ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఈ పాత్ర గురించి వివరిస్తూ.. దృష్టిపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తిగా నటించడానికి చాలా ప్రాక్టీస్ చేశానని, కళ్లకు గంతలు కట్టుకొని ఇంట్లో తిరిగేవాడనని చెప్పారు. 'ఇంట్లోని వస్తువులను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొనేవాడిని. కళ్లకు గంతలు కట్టుకొని ఇంట్లో జాగ్రత్తగా నడుస్తూ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను.

కొన్నిసార్లు గోడకు గుద్దుకోవడంతో గాయాలు కూడా అయ్యాయి. చూపు లేకపోతే ఎంతకష్టమో ఈ సందర్భంగా తెలిసింది. ఈ పాత్రను ప్రభావవంతంగా పోషించడానికి అంధులకు సంబంధించిన వీడియోలను చాలా చూశాను. నన్ను కలువడానికి వచ్చిన ఓ అంధుడితో ఓ రోజంతా గడిపాను. ఇద్దరం కలిసి భోజనం చేశాం. అతడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహరం కింద పడకుండా చక్కగా భోజనం చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది'అని చెప్పాడు.

English summary
Bollywood Star Hrithik Roshan revealed about his role in Kaabil Movie. He practiced blindfold for Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu