»   » గణేష్ నిమజ్జనంలో హృతిక్ రోషన్ సందడి (ఫోటోలు)

గణేష్ నిమజ్జనంలో హృతిక్ రోషన్ సందడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశంలో ఎక్కడ చూసినా గణేష్ ఉత్సవాల సందడే. సామాన్యులు, చిన్న పిల్లలు, ప్రముఖులు, సెలబ్రిటీలు, సినిమా తారలు, రాజకీయ నాయకులు అందరూ గణపతి బప్పా మరియా అంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఆయన కుటుంబ సభ్యులు కూడా గణేష్ ఉత్సవాల్లో సందడి గడిపారు.

హృతిక్ రోషన్‌తో పాటు ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్ కూడా గణేష్ ఉత్సవాల్లో పాల్గొని సందడి చేసారు. అందుకు సంబంధించిన దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు. తమ రాబోయే సినిమా 'క్రిష్-3' బాక్సాఫీసు వద్ద పెద్ద విజయం సాధించాలని ప్రత్యేక పూజలు కూడా చేయించారట.

హృతిక్ రోషన్ గణేష్ ఉత్సవాల ఫోటోలతో పాటు చూస్తూ..'క్రిష్-3' సినిమా వివరాలు స్లైడ్ షోలో....

క్రిష్-3

క్రిష్-3

రాకేష్ రోషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘క్రిష్-3' చిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో బాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలకు సీక్వెల్‌గా క్రిష్-3 చిత్రం రూపొందుతోంది. హృతి రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయన నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రపై భారీ అంచనాలున్నాయి.

తెలుగులో కూడా...

తెలుగులో కూడా...

తెలుగులో కూడా ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘క్రిష్-3' థియేటర్ రైట్స్ నైజాం ఏరియాలో రూ. 3.75 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఇతర ఏరియాలన్నీ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం.

దీపావళికి విడుదల

దీపావళికి విడుదల

క్రిష్-3 సినిమాను దీపావళి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకోసం ఆయన లుక్ పాత్రకు తగిన విధంగా కనిపించేందుకు ప్రత్యేకంగా కాస్టూమ్స్ డిజైన్ చేసారు. మెటల్‌తో తయారు చేయడంతో దాని బరువు 28 కేజీలకు చేరిందట.

హాలీవుడ్ లెవల్లో...

హాలీవుడ్ లెవల్లో...

ఇటీవల విడుదలైన ‘క్రిష్-3' ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే దీన్ని హాలీవుడ్ లెవల్లో తీసారని స్పష్టం అవుతోంది. తాజాగా సినిమాలోని ‘రఘుపతి రాఘవ్' సాంగుకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులో డాన్స్ స్టెప్పులతో హృతిక్ అదరగొట్టాడు.

English summary
Bollywood actor Hrithik Roshan with his father Rakesh Roshan performing pooja during the Ganesh utsav in Mumbai on September 10th, 2013.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu