'మొహంజోదారో' షూటింగులో హృతిక్ రోషన్ కు గాయాలు
హైదరాబాద్: 'మొహంజోదారో' చిత్రం షూటింగ్ లో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు గాయపడ్డాడు. చిత్రీకరణలో భాగంగా ఓ సన్నివేశం తీస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. హృతిక్ ఎడమకాలికి గాయం కాగా, వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు రెండు వారాల రెస్టు అవసరం అని వైద్యులు సూచించడంతో షూటింగ్ నిలిచి పోయింది. తన గాయంపై హృతిక్ స్పందిస్తూ...లవ్లీ ఫాల్ అంటూ ట్వీట్ చేసాడు.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా... లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మొహెంజోదారో' . ఈ చిత్రంలో పూజా హెడ్గే హీరోయిన్ గా నటిస్తోంది.

సినిమాలో హృతిక్ దాదాపు 20 అడుగుల పొడవున్న భారీ మొసలితో పోరాడే సన్నివేశంలో కనిపించబోతోన్నాడు. ఈ సినిమా ఆయన గత సినిమాకు భిన్నమైన లుక్ లో కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











