»   » హృతిక్ రోషన్ ‘క్రిష్-3’ తెలుగు రైట్స్ ఎంతంటే?

హృతిక్ రోషన్ ‘క్రిష్-3’ తెలుగు రైట్స్ ఎంతంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన క్రిష్-3 చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'క్రిష్-3' థియేటర్ రైట్స్ నైజాం ఏరియాలో రూ. 3.75 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఇతర ఏరియాలన్నీ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం.

తెలుగులో కూడా హృతిక్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో తెలుగులో విడుదలైన క్రిష్ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అదే విధంగా హృతిక్ నటించిన 'ధూమ్-2' చిత్రం ఏపీలో రూ. 6 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో 'క్రిష్-3' చిత్రం కూడా ఇక్కడ మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

కాగా...ఇటీవల విడుదలైన 'క్రిష్-3' ఫస్ట్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అనూహ్య స్పందన చ్చింది. విడుదలైన పది రోజుల్లో ట్రైలర్ 1 కోటి 20 లక్షలకు పైగా హిట్స్ సొంతం చేసుకుంది. ట్రైలర్ చాలా బాగుందనే టాక్ రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

రాకేష్ రోషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో బాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలకు సీక్వెల్‌గా క్రిష్-3 చిత్రం రూపొందుతోంది. హృతి రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయన నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రపై భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకోసం ఆయన లుక్ పాత్రకు తగిన విధంగా కనిపించేందుకు ప్రత్యేకంగా కాస్టూమ్స్ డిజైన్ చేసారు. మెటల్‌తో తయారు చేయడంతో దాని బరువు 28 కేజీలకు చేరిందట. సినిమాలో తన పాత్రను ఛాలెంజ్ గా తీసుకున్న వివేక్ ఆ బరువును లెక్కచేయకుండా ఇష్టపడి ఆ పాత్రలో అద్భుతంగా నటించాడట.

క్రిష్-3 చిత్రంలో హృతిక్ రోషన్ సూపర్ మేన్ పాత్రలో కనిపించబోతునప్నాడు. సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈచిత్రం విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని ఈ ట్రైలర్ ను బట్టి స్పష్టం అవుతోంది. దీపావళికి ఈచిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Hrithik Roshan Krrish 3 has been sold for a record price in AP. The Nizam theatrical rights of the film has been fetched 3.75Cr. Rights of rest areas have been sold to Asian & KFC for around 1.75Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu