»   » తెలుగులో హృతిక్ రోషన్ యాక్షన్ మూవీ ‘బ్యాంగ్ బ్యాంగ్’

తెలుగులో హృతిక్ రోషన్ యాక్షన్ మూవీ ‘బ్యాంగ్ బ్యాంగ్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా బాలీవుడ్లో 'బ్యాంగ్ బ్యాంగ్' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకు ముందు హృతిక్ నటించిన క్రిష్ చిత్రం తెలుగు, తమిళంలో మంచి వసూళ్లు సాధించడంతో....'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాన్ని కూడా తెలుగు తమిళంలో విడుదల చేస్తున్నారు.

ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. కత్రినా, హృతిక్ కలిసి నటిస్తున్నారంటేనే సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. విడుదలైన ఫస్ట్ లుక్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Hrithik Roshan's Bang Bang to release in three languages

చివరిసారిగా ఈ ఇద్దరు స్టార్స్ 'జిందగీ న మిలేగి దొబారా' చిత్రంలో కలిసి నటించారు. ఆ చిత్రంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి నటిస్తుండటంపై సర్వతా ఆసక్తి నెలకొంది. యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదో భారీ బడ్జెట్ చిత్రం.

ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సంబంధించిన ఫోటో షూట్ ముంబై సబర్బన్‌లోని ఓ స్విమ్మింగ్ ఫూల్‌లో నిర్వహించారు. ఇందుకోసం ఒక రోజు మొత్తం స్విమ్మింగ్ ఫూల్ బుక్ చేసారు. హాలీవుడ్లో టామ్ క్రూయిజ్, కామెరూన్ డియాజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'నైట్ అండ్ డే' చిత్రానికి రీమేక్‌‌గా 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Actor Hrithik Roshan's much-awaited film "Bang Bang" will release Oct 2 in three languages - Hindi, Tamil and Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu