Just In
Don't Miss!
- Lifestyle
మీ రాశిని బట్టి ఏ రత్నం ధరిస్తే.. శుభఫలితాలొస్తాయంటే...!
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్
- News
ప్లెక్సీ రగడ.. కనిపించని మోడీ, బీజేపీ శ్రేణుల ఆగ్రహాం, కేసీఆర్ ఫోటో చించివేత
- Finance
Budget 2021-22: స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాల ధరలు పెరుగుతాయా?
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇలాంటి ట్రైలర్ ఈ మధ్యకాలంలో రాలేదు (వీడియో)
ముంబై: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మొహెంజొదారో చిత్ర ట్రైలర్ విడుదలైంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, పూజా హెగ్దేలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మొహెంజొదారో. చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. చిత్రం ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నారు.
ఈ చిత్రంలో శర్మన్ పాత్రలో ఓ రైతుగా హృతిక్ కనిపించగా.. చాని పాత్రలో పూజా ఎంతో అందంగా కనిపిస్తోంది. క్రీస్తు పుట్టకముందు 2016 సంవత్సరంలో సింధు నాగరికత ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

డాన్సర్‌తో హృతిక్ లవ్ స్టోరీ.. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లోని మొహెంజొదారో సంప్రదాయాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని అషుతోష్ గోవారికర్ తెరకెక్కిస్తున్నారు. సిద్దార్థ్ రాయ్ కపూర్, సునితా గోవారికర్‌లు సహనిర్మాతలు వ్యవహరిస్తున్నారు. సినిమా షూటింగ్ బుజ్,ముంబయి, జబల్‌పూర్, థానేల్లో జరుగుతోంది. ఏ.ఆర్ రెహమాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సాటిలైట్, మ్యూజిక్ రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలయ్యాక కూడా దాదాపు రూ.200కోట్ల వసూళ్లు రాబడుతుందని చిత్ర బృందం గట్టి నమ్మకంతో ఉంది. ఇప్పటి వరకు హృతిక్ నటించిన సినిమాల్లో ఇంత భారీ మొత్తంలో రికార్డు సృష్టించిన మొదటి చిత్రం కూడా ఇదే కావడం విశేషం.