»   » సూపర్ స్టార్ సినిమాకు కాపీ వివాదం, కోర్టులో కేసు!

సూపర్ స్టార్ సినిమాకు కాపీ వివాదం, కోర్టులో కేసు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ప్రస్తుతం అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో ‘మొహెంజోదారో' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన తన తండ్రి రాకేష్ రోషన్ నిర్మించే సినిమాలో చేయాలని నిర్ణయించుకున్నారు. సంజయ్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

హృతిక్ రోషన్, కరీనా కపూర్ జంటగా నటించే ఈ సినిమాను ఫిబ్రవరిలో మొదలు పెట్టి 120 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఈ సినిమా మొదలు కాక ముందే చిక్కుల్లో పడింది. నటుడు సుదాన్షు పాండే ఈ సినిమాపై కోర్టు కెక్కాడు. దర్శకుడు సంజయ్ గుప్తా తన అనుమతి లేకుండా తన కథ, స్క్రీన్ ప్లేను వాడుకుంటున్నాడని, రెండున్నరేళ్ల పాటు కష్టపడి ఫర్మాయిష్ పేరుతో తాను కథ,స్క్రీన్ ప్లే, మాటలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు కొలిక్కి వచ్చే వరకు షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదని అంటున్నారు.

Hrithik Roshan's next in Legal Troubles

ప్రస్తుతం హృతిక్ రోషన్ నటిస్తున్న ‘మొహంజోదారో' సినిమా వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా... లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మొహెంజోదారో' . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సినిమాలో హృతిక్ దాదాపు 20 అడుగుల పొడవున్న భారీ మొసలితో పోరాడే సన్నివేశంలో కనిపించబోతోన్నాడు.

English summary
Bollyood source said that, Hrithik Roshan's next project in Legal Troubles. Sudhanshu Pandey sends notice to Rakesh Roshan and Sanjay Gupta.
Please Wait while comments are loading...