»   » హృతిక్, సోనమ్ కెమిస్ట్రీ అదుర్స్ .. హానీసింగ్ పాటకు 20 కోట్ల హిట్స్

హృతిక్, సోనమ్ కెమిస్ట్రీ అదుర్స్ .. హానీసింగ్ పాటకు 20 కోట్ల హిట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ధీరే ధీరే సే మెరె జిందగీమే ఆనా అంటూ బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, సోనమ్ కపూర్ నటించిన వీడియో ఆల్బమ్‌ యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్నది. యూట్యూబ్‌లో ఒక భారతీయ పాట 20 కోట్లకు పైగా హిట్లను సాధించడం రికార్డు. ఈ పాట సంగీత ప్రేమికులను ఇంకా విశేషంగా ఆకట్టుకొంటున్నది.

 యూట్యూబ్‌లో యోయో హానీసింగ్ సెన్షేషన్

యూట్యూబ్‌లో యోయో హానీసింగ్ సెన్షేషన్


ఈ బీట్‌ను రూపొందించిన ఇండియన్ పాప్ స్టార్ యో యో హానీ సింగ్ ఒకే రోజులో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో హానీసింగ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో ఈ ఆల్బమ్ మరో దంగల్ అని, హానీని మరో అమీర్ ఖాన్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. భారతీయ సంగీత ప్రపంచంలోనే ‘ధీరే ధీరే' అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది.

 విశేషంగా ఆకర్షిస్తున్న ధీరే ధీరే సే..

విశేషంగా ఆకర్షిస్తున్న ధీరే ధీరే సే..

ఆషీకీ చిత్రంలోని ధీరే ధీరే పాట 90వ యువతీ, యువకులను ఉర్రూతలూగించింది. ఆషికీ ఘన విజయానికి ఈ పాట దోహదపడింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ పాటను హానీసింగ్ తాజాగా రీమేక్ చేశారు. నేటి యువతకు నచ్చే విధంగా ఈ ఆల్బమ్‌ను రూపొందించారు. గతేడాది యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఈ పాటను ఇప్పటివరకు 2,116,816 మంది చూశారు.

 హృతిక్, సోనమ్ కెమిస్ట్రీ అదుర్స్

హృతిక్, సోనమ్ కెమిస్ట్రీ అదుర్స్


ఈ పాటలో హృతిక్ రోషన్, సోనమ్ కపూర్ అభినయం అదరగొట్టింది. వారి మధ్య కెమిస్ట్రీ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొంటున్నది. అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపడం ఈ పాటకు అదనపు బోనస్‌గా మారింది. ఫొటోగ్రఫీ, సంగీతం మళ్లీ మళ్లీ వినాలనిపించే విధంగా ఉండటం యువతను మరింత ఎట్రాక్ట్ చేసింది.

రికార్డుపై హనీసింగ్ ఆనందం..

రికార్డుపై హనీసింగ్ ఆనందం..

తాను రూపొందించిన ఆల్బమ్‌కు 20 కోట్లకు పైగా హిట్స్ రావడంపై హానీసింగ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ పాటను పెద్ద మొత్తంలో రిసీవ్ చేసుకొని తనపై కురిపించిన ప్రేమ, అభిమానానికి ధన్యుడిని అని ఆయన అన్నాడు. చాలా కష్టపడి ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాటకు వచ్చిన స్పందనతో జన్మధన్యమైందని హానీ చెప్పాడు.

 గతంలోనూ యూట్యూట్‌లో హానీ హవా

గతంలోనూ యూట్యూట్‌లో హానీ హవా


గతంలో హానీ సింగ్ రూపొందించిన పార్టీ ఆల్ నైట్, దేసీ కళాకార్, బ్లూ ఐస్ ఆల్బమ్స్‌కు యూట్యూబ్‌లో విశేష స్పందన వచ్చింది. కేవలం ఆల్బమ్స్ కే కాకుండా ఆయన సంగీతం వహించిన చిత్రాల్లోని పాటలు మ్యూజిక్ లవర్స్ ఆకట్టుకొన్నాయి. అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన సంగీత దర్శకుల్లో హనీసింగ్ ఒకరిగా ఖ్యాతిని సంపాదించుకొన్నారు.

English summary
Singer and raper Yo Yo Honey Singh's song Dheere Dheere Se crossing 200 million views on YouTube. Bollywood stars Hrithik Roshan-Sonam Kapoor acted in this music Album
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu