twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హృతిక్‌ రోషన్‌ మెదడుకి శస్త్రచికిత్స...సేఫ్

    By Srikanya
    |

    ముంబై: హిందీ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ మెదడుకి శస్త్రచికిత్స జరిగింది. ఆదివారం మధ్యాహ్నాం రెండు గంటలకు ముంబయిలోని హిందుజా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. ఆయన గత కొద్దికాలంగా క్రానిక్‌ సబ్‌డ్యూరల్‌ హెటోమాతో బాధపడుతున్నారు. మెదడు, పుర్రెకి మధ్యలో కొద్దిగా రక్తం గడ్డకట్టడంతో హృతిక్‌ శస్త్రచికిత్స తప్పనిసరైంది.

    ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని ఆయన తండ్రి మీడియాకు తెలియచేసారు. రెండు నెలల క్రితం ఓ స్టంట్ చేస్తున్నప్పుడు తగిలిన దెబ్బ వల్ల ఇలా జరిగిందని హాస్పటల్ వైద్యుడు తెలియచేసారు. అప్పుడు సీరియస్ గా తీసుకోలేదని అందుకే ఆపరేషన్ దాకా వెళ్ళిందని అన్నారు. ఇక ఆపరేషన్ కు ముందే ఈ విషయమై హృతిక్‌ తన ఫేస్‌బుక్‌ పేజీపై కొన్ని వ్యాఖ్యలు రాశారు.

    ''మెదడు ఇచ్చే శక్తితోనే మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఆ మెదడు ఇచ్చిన శక్తి వల్లే నేను ఎన్నో అద్భుతాలు చేయగలిగాను. మెదడు వల్ల మనం చూస్తున్నాం.. వింటున్నాం.. స్పర్శ.. వాసన.. రుచి ఇలా అన్నీ తెలుస్తున్నాయి. భయం, ధైర్యం లాంటి వాటినీ మెదడే ఇస్తుంది. నేనిప్పుడు మెదడుకి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకుంటున్నాను. నాకు మళ్లీ అంతే స్థాయిలో శక్తి వస్తుందని నమ్ముతున్నాను. నా కోసం మీ మెదడుని ఉపయోగించిన అందరికీ నా కృతజ్ఞతలు'' అని రాశారు.

    మరో ప్రక్క క్రిష్ చిత్రంతో ప్రపంచ మార్కెట్ ని సైతం ఆకట్టుకున్న రాకేష్ రోషన్ ..తన కుమారుడుతో ఆ ఆ చిత్రానికి మూడో సీక్వెల్ కి రంగం సిద్దం చేసారు. 'కైట్స్' చిత్రం ఫ్లాప్ తర్వాత ఏకొత్త ప్రాజెక్టునూ ప్రకటించని రాకేశ్ రోషన్ ఒక్కసారిగా నాలుగు యాని మేషన్ సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. అందులో క్రిష్-3 భారతీయులు గర్వపడే చిత్రమవుతుందని చెబుతున్నాడు. 2013 దీపావళి(నవంబర్ 3)న విడుదల చేస్తారని చెప్తున్నారు.

    English summary
    
 Hrithik Roshan underwent a brain surgery successfully on Sunday for a problem caused due to an injury, with his director-father Rakesh Roshan saying that there is nothing serious. The 39-year-old Krrish star is suffering from Subdural Hematoma, which is often caused by bleeding of veins in the brain as a result of a blow to the head. He is currently admitted to the Hinduja hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X