»   »  షాక్ : డిజాస్టర్ సినిమా... రీరిలీజ్ లో సూపర్ హిట్

షాక్ : డిజాస్టర్ సినిమా... రీరిలీజ్ లో సూపర్ హిట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : మొదటసారి రిలీజైనప్పుడు ఆడని సినిమాని మళ్లీ రీరిలీజ్ చేయటం అంటే సాహసమే. అయితే అలా చేసినప్పుడు ఒక్కోసారి అద్బుతాలు జరుగుతాయని కన్నడ చిత్ర సీమ రుజువు చేసింది. ఏడాది కిందట నవంబరులో హుచ్చ వెంకట్‌ అనే సినిమా విడుదలైంది. అప్పట్లో కేవలం 17 మంది ప్రేక్షకులు మాత్రమే సినిమాను చూసారు.

ఆ సంఘటన ఈ చిత్రం నిర్మాత, దర్సకుడు, హీరో అయిన వెంకట్‌లో ఆగ్రహాన్ని కల్గించింది... ఆవేదననూ పెంచింది. సందేశాత్మకంగా సినిమాను రూపొందిస్తే చూసేవారే లేరా అని బాధపడ్డారు. ఇటీవల ఈటీవీ కన్నడలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ కార్యక్రమంతో ఒక్కసారిగా హుచ్చవెంకట్‌ వెలుగులోకి వచ్చారు.

Huccha Venkat to re-release his film!

బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ కావడం, అనంతరం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జైలుకు కూడా వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు యోగరాజ్‌భట్‌ సారథ్యంలో రూపొందుతున్న ‘పరపంచ' సినిమాలో ఓ పాటను పాడడమే కాకుండా అందులో నటించారు కూడా.

Huccha Venkat to re-release his film!

ఈ అన్ని సంఘటనలతో తనకు లభించిన ప్రాచుర్యం నేపథ్యంలో ఏడాది కిందట విడుదలై- ప్రేక్షకుల తిరస్కరణకు గురైన ‘హుచ్చవెంకట్‌' సినిమాను శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాల్లో మరోసారి విడుదల చేశారు.

గతంలో నిరాదరణకు గురైన ఈసినిమాకు ఇప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదల రోజున దాదాపు అన్ని కేంద్రాలు హౌస్‌ఫుల్‌ అయ్యాయి. మరిన్ని థియేటర్లలో విడుదల చేయాలని ఇతర ప్రాంతాల నుంచి డిమాండ్‌ వస్తోందట.

English summary
Sndalwood actor, director, producer and former Bigg Boss contestant Huccha Venkat-starrer Huccha Venkat will be re-released across the state on December 18 , which was a dud at the Box Office in its first release. .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu