»   » రోజులు మారాయి: ఆ విషయంలో త్రివిక్రమ్ తర్వాత మారుతి!

రోజులు మారాయి: ఆ విషయంలో త్రివిక్రమ్ తర్వాత మారుతి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మద్య తెలుగులో వరుస సక్సెస్ లతో దూసుకెలుతున్న ఫిల్మ్ మేకర్ మారుతి. దర్శకుడిగా నిర్మాతగానే కాదు....రచయితగా కూడా మారుతి తన సత్తా చాటుతున్నాడు. త్వరలో విడుదల కానున్న రోజులు మారాయి చిత్రానికి రైటర్ ఈయనే. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకి రైటర్ గా మంచి పారితోషికం పుచ్చుకున్న మారుతి.. లాభాల్లో కూడా వాటా అందుకోబోతున్నాడట.

మరో వైపు రాజ్ తరుణ్ హీరోగా ప్రారంభం కానున్న 'రాజుగాడు' అనే సినిమాకి కూడా మారుతి స్క్రిప్ట్ అందించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం నిర్మాతల నుంచి కోటికి పైగా చెక్ ను అందుకున్నాడట. ఇప్పటి వరకు ఈ రేంజి రెమ్యూనరేషన్ అందుకున్న రచయిత త్రివిక్రమ్ మాత్రమే. ఆయన తర్వాత మారుతి మాత్రమే కేవలం రయితగా కోటికిపైగా రెమ్యూరేషన్ అందుకున్నాడని అంటున్నారు.

Huge demand for director Maruthi's scripts

మారుతి తాజా సినిమా 'రోజులు మారాయి' జులై 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మారుతి సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. 'రోజులు మారాయి' కథ రియల్ లైప్ ఆధారంగా జరిగిన సంఘటన నుండి తయారు చేసిందే అన్నారు.

ఓసారి పేప‌ర్‌లో ల‌వ్‌, రిలేష‌న్ షిప్స్‌లో అమ్మాయిలు ఓ అబ్బాయిని చంపేశార‌ని చ‌దివాను. ఆ ఆర్టిక‌ల్ చ‌దువుతుంటే రోజులుమారాయి క‌థ నా ఆలోచ‌న‌కు వ‌చ్చింది. ఆ ఆర్టిక‌ల్‌ను ఫ‌న్నీగా మ‌లుచుకుంటూ నేను, డైరెక్ట‌ర్ ముర‌ళి, రైట‌ర్ ర‌వి క‌లిసి ఆ పాయింట్‌ను డెవ‌ల‌ప్ చేశామని మారుతి తెలిపారు.

English summary
When writers are busy with their directorial ventures, seems like director Maruthi is cashing on the gap by providing stories to his subordinates. Already his story is coming as "Rojulu Marayi" cinema on July 1st, while hero Raj Tarun's "Raju Gadu" is also having story penned by him. This film will be directed by Sanjana Reddy, a former associate of Maruthi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu