'కాలా' కుక్క విలువ 2 కోట్లు.. రజినీకి చాలా ఇష్టం, వీధిలో అలా దొరికింది!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా. ఈ చిత్రంలో రజినీ డాన్ పాత్రలో నటిస్తున్నాడు. కబాలి ఫేమ్ రంజిత్ ఫా ఈ చిత్రానికి దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్యురేషి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27 న విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

కాలా చిత్రంలో రజినీకాంత్ గెటప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నలుపు దుస్తులలో కనిపిస్తున్నా రజిని ఎప్పటిలాగే స్టైల్ తో అదరగొట్టేశాడు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్ర పోస్టర్స్ లో రజినీకాంత్ పక్కన ఉన్న కుక్క ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాలా చిత్రంలో రజినీకాంత్ పక్కన కనిపించడంతో ఈ కుక్క దశ తిరిగిపోయింది. ఈ కుక్కని రూ 2 కోట్లు వెచ్చించి కొనుక్కునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని ట్రైనర్ సిమన్ తెలిపాడు. కానీ ఈ కుక్కని తాను అమ్మదలుచుకోలేదని ప్రకటించాడు. ఈ కుక్కంటే రజినీకాంత్ కు చాలా ఇష్టం అని సిమన్ తెలిపారు. షూటింగ్ కు వచ్చే ప్రతిరోజు రజిని ఈ కుక్క కోసం ప్రత్యేకమైన బిస్కెట్లు తీసుకుని వచ్చేవారని సిమన్ తెలిపారు. కాలా దర్శకుడు రంజిత్ ఈ చిత్రం కోసం చాలా కుక్కలని పరిశీలించారు. కానీ చెన్నై వీధిలో కనిపించిన ఈ కుక్కని చివరకు ఫైనల్ చేసారని వివరించారు.


Click it and Unblock the Notifications











