»   » టాక్ ఆఫ్ ద టాలీవుడ్ ఆ కన్నడ సినిమానే... ఆ కన్నడ సినిమా అంటే భయపడుతున్న తెలుగు సినీ టౌన్

టాక్ ఆఫ్ ద టాలీవుడ్ ఆ కన్నడ సినిమానే... ఆ కన్నడ సినిమా అంటే భయపడుతున్న తెలుగు సినీ టౌన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ కన్నడ సినిమా తెలుగులో.. అత్యంత భారీ స్థాయిలో.. ఇంతకు ముందెన్నడూ లేనంత రేంజ్‌లో.. హంగామా చేయనుంది. అదే 'జాగ్వార్‌'. కన్నడ రాజకీయ ప్రముఖుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన కుమారుడు నిఖిల్‌ కుమార్‌ గౌడ హీరోగా తెరకెక్కిస్తున్న 'జాగ్వార్‌' సినిమాకి తెలుగులోనూ హైప్‌ తెచ్చేందుకు పడ్తున్న పాట్లు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. పది కాదు, పాతిక కాదు.. ఏకంగా 75 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కిందట.

ఒక కొత్త హీరో సినిమాకు 75 కోట్ల బడ్జెట్ ఒక సంచలనం అయితే ఆ సినిమా పబ్లిసిటీ కోసం కుమారస్వామి డబ్బును ఇప్పటికే విపరీతంగా ఖర్చు చేయడం సంచలనం గా మారింది. ఈ నెలాఖరుకు వచ్చేనెల మొదటి వారంలో రానున్న దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను మన ఇరు రాష్ట్రాలలోని అన్ని ముఖ్య ధియేటర్లలో ఇప్పటి నుంచే ప్రదర్శిస్తూ ఈ సినిమాకు మరింత హైక్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా తెరకెక్కుతోంది కన్నడలోనే అయినా... తెలుగు మార్కెట్ మీద బాగా ఫోకస్ పెట్టారు. అందుకే సెప్టెంబర్ 18న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్ ప్లాన్ చేసారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఆడియో వేడుకకు కూడా షాకయ్యే రేంజిలో ఖర్చు పెడుతున్నారు


వినీ ఎరుగని స్థాయిలో ఖర్చు:

వినీ ఎరుగని స్థాయిలో ఖర్చు:

ఈ సినిమా ఆడియో విడుదల వేడుక కోసం కూడా కనీ వినీ ఎరుగని స్థాయిలో ఖర్చు చేయనున్నారట. తమిళ, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులే కాకుండా, రాజకీయ ప్రముఖులూ ఈ వేడుకలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.


పవన్ కళ్యాణ్ :

పవన్ కళ్యాణ్ :

పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు వస్తే సినిమా హిట్టవుతుందనే సెంటిమెంటు ఉంది. పైగా పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు వస్తే మీడియాలో ఈ సినిమా గురించి బాగా పబ్లిసిటీ అవుతుంది. ఆయన అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి పెంచుకునే అవకాశం ఉంది.


ఆడియో వేడుక కోసమే దాదాపు రూ. 1 కోటి వరకు ఖర్చు :

ఆడియో వేడుక కోసమే దాదాపు రూ. 1 కోటి వరకు ఖర్చు :

హైదరాబాద్ లో జరిగే జాగ్వార్ ఆడియో వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరినీ పిలుస్తున్నారు. ఆడియో వేడుక తర్వాత సినిమాపై హైప్ భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. కేవలం ఆడియో వేడుక కోసమే దాదాపు రూ. 1 కోటి వరకు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.


తెలుగు అగ్ర హీరోలందరూ:

తెలుగు అగ్ర హీరోలందరూ:

ఇప్పటికే, కుమారస్వామి - పవన్‌కళ్యాణ్‌ ఆశీస్సుల కోసం హైద్రాబాద్‌కి వచ్చి, ఏకంగా పవన్‌ సోదరుడిగా తన కుమారుడ నిఖిల్‌ని ప్రకటించేసిన విషయం విదితమే. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ తదితరులతోనూ త్వరలో సమావేశం కానున్నారట కుమారస్వామి. అదే సమయంలో, పలువురు తమిళ సినీ ప్రముఖులతోనూ కుమారస్వామి మంతనాలు జరుపుతున్నారు


ఐటం సాంగ్ కే 2 కోట్లు :

ఐటం సాంగ్ కే 2 కోట్లు :

ఈ సినిమాలో ఐటం సాంగ్ చేసేందుకు శృతి హాసన్ ను సంప్రదించినట్లు సమాచారం. ఇందుకోసం ఆమెకు రూ. 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్. ఐతం సాంగ్ మొతానికీ అయిన ఖర్చు కాదు కేవల ఆ సాంగ్ కోసం దాన్స్ చేసినందుకే 2 కోట్లు.


రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా :

రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా :

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తే రాజమౌళి ప్రియ శిష్యుడు మహాదేవ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దీనితో ఈసినిమాకు కూడ రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా మారే అవకాశం ఉంది.


దర్శక నిర్మాతల ఆందోలన :

దర్శక నిర్మాతల ఆందోలన :

ఇక దసరాను నమ్ముకుని ఎన్నో సినిమాలు వస్తున్న నేపధ్యంలో ఊహించని సునామీల దూసుకు వస్తున్న ఈ ‘జాగ్వార్' ను చూసి టాలీవుడ్ లోని చాలామంది దర్శక నిర్మాతలు ఆందోలన లో ఉన్నట్టు తెలుస్తోంది.


వచ్చేనెల మొదటి వారంలో :

వచ్చేనెల మొదటి వారంలో :

ఈ నెలాఖరుకు వచ్చేనెల మొదటి వారంలో రానున్న దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను మన ఇరు రాష్ట్రాలలోని అన్ని ముఖ్య ధియేటర్లలో ఇప్పటి నుంచే ప్రదర్శిస్తూ ఈ సినిమాకు మరింత హైక్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.


టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ :

టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ :

75 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక సినిమా తీయడం సంచలనం అయితే ఆ సినిమా తెలుగు డబ్బింగ్ ఆడియో ఫంక్షన్ కోసం చేయబోతున్న ఖర్చు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.


తెర వెనక:

తెర వెనక:

ఈ చిత్రానికి సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్‌, సినిమాటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, మ్యూజిక్‌: యస్‌.యస్‌. థమన్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్‌: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: ఎ. మహదేవ్‌


English summary
spending crores of money for nikhil kumar's Jaguar audio launch, trailer released on Friday
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu