10 టీజర్లు.. 13 మోషన్ పోస్టర్లు.. నాగార్జున నటించిన సినిమాకు భారీ ప్రమోషన్స్
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత నాగార్జున నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. 2018లో సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యింది. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, మలయాళం, బెంగాలీ భాషల్లో కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. దాదాపు షూటింగ్ పనులు మొత్తం ముగిశాయి.

కేవలం కొన్ని సాంగ్స్ తో పాటు చిన్నప్పటి ప్యాచప్ సన్నివేశాలను పూర్తి చేస్తే మొత్తం పని కూడా అయిపోతుందట. ఇక లాక్ డౌన్ అనంతరం ప్రమోషన్ డోస్ పెంచాలని ప్లాన్ వేశారు ప్రమోషన్ కోసం 10 టీజర్లు, 13 మోషన్ పోస్టర్లు రెడీ చేసినట్లు టాక్ వస్తోంది. ఈ సినిమాను అంచనాలకు తగ్గకుండా అన్ని భాషల వారికి నచ్చేలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్‌లన్నింటిని కూడా తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఫాంటసీ డ్రామాగా రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమా ఈ ఏడాది చివరి నాటికి తెరపైకి రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











