»   » సూపర్ స్టారా మాజాకా...సినిమా ప్రచారానికే 15 కోట్ల ఖర్చు!

సూపర్ స్టారా మాజాకా...సినిమా ప్రచారానికే 15 కోట్ల ఖర్చు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'కొచ్చాడయాన్' చిత్రం విడుదల ముందే సంచలనాలు సృష్టిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ప్రమోట్ చేయడానికి కూడా నిర్మాతలు భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నారు. కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే రూ. 15 కోట్లు వెచ్చిస్తున్నారట.

తమిళ, తెలుగు, హిందీతో పాటు పంజాబీ, భోజ్పురి, మరాఠి భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో ప్రచారం అదరగొట్టనున్నారు. ఒక్క చెన్నై సిటీలోనే నాలుగు వేల హోర్డింగులు ఏర్పాటు చేయబోతున్నారట. మరి ఇంత భారీగా ఖర్చు పెడుతున్న ఈచిత్రం ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.

'కొచ్చాడయాన్' తెలుగులో 'విక్రమసింహ' పేరుతో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 9వ తేదీన చెన్నైలోని 'సత్యం సినిమాస్'లో గ్రాండ్‌గా జరుగనుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరై సీడీలను విడుదల చేయనున్నారు.

'విక్రమసింహ' చిత్రం 3డిలో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా మూవీ. కె.ఎస్.రవికుమార్ కథ అందించిన ఈచిత్రానికి రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్ శరత్ కుమార్, ఆది, శోభన, రుక్మిణి విజయ్ కుమార్, జాకీ ష్రాఫ్, నాజర్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవన్ మీనన్ ఈచిత్రానికి పని చేస్తున్నారు. అవతార్ లాంటి చిత్రాల్లో ఉపయోగించిన మోషన్ కాప్చర్ టెక్నాలజీనీ ఈ చిత్రంలో ఉపయోగిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలో ప్రక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

English summary

 For the first time in the history of Indian Cinema, the much-awaited period film "Kochadaiyaan" featuring Tamil superstar Rajinikanth and Bollywood actress Deepika Padukone in the lead, would be released in six different languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu