»   » మా అబ్బాయి ప్రియురాలు తప్పిపోయింది.. వైరల్‌గా విక్రమ్ ట్వీట్ (వీడియో)

మా అబ్బాయి ప్రియురాలు తప్పిపోయింది.. వైరల్‌గా విక్రమ్ ట్వీట్ (వీడియో)

Written By:
Subscribe to Filmibeat Telugu

అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్ వర్మ చిత్రం రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్నది. విభిన్నమైన పద్ధతిలో చేస్తున్న ప్రమోషన్ విపరీతంగా ఆకట్టుకొంటున్నది. వర్మ చిత్రం ద్వారా తమిళ సూపర్‌స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ్ కోలీవుడ్‌లో అడుగపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్ ఎంపిక కోసం విక్రమ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రియురాలు తప్పిపోయింది

ప్రియురాలు తప్పిపోయింది

తమిళ అర్జున్ రెడ్డి ధ్రువ్ ప్రియురాలి కోసం వేట మొదలైంది. మా అబ్బాయి ప్రియురాలు తప్పిపోయింది. అది మీరే అయితే.. మీలో ఎవరైనా ఒకరు మా అబ్బాయికి ప్రియురాలిగా మారాలంటే మీ ఫొటోను గానీ మీ గురించి తెలిపే వీడియోను గానీ varmathemoviegmail.com ఈ-మెయిల్‌కు పోస్ట్ చేయండి అని విక్రమ్ ట్వీట్ చేశారు.

ధ్రువ్ హీరోయిన్ ఇలా ఉంటుంది

వర్మ ప్రియురాలు ఇలా ఉండబోతుందంటూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో అమ్మాయి మొహం కనిపించకుండా చూపించి... ఇలాంటి లక్షణాలున్న హీరోయిన్‌ కావాలని, అలాంటివారు సంప్రదించవచ్చని చెప్పారు.

విక్రమ్ ట్వీట్ వైరల్

విక్రమ్ ట్వీట్ వైరల్

ధ్రువ్ ప్రియురాలి కోసం వెతుకులాట కోసం విక్రమ్ ట్వీట్ చేయగానే సోషల్ మీడియాలో అలజడి మొదలైంది. పలు మీడియా చానెల్లు విక్రమ్ ట్వీట్ రీ ట్వీట్ చేశాయి. ఆ తర్వాత హీరోయిన్ కోసం దరఖాస్తుల వెల్లువల వస్తున్నట్టు సమాచారం.

సోషల్ మీడియా జామ్

సోషల్ మీడియా జామ్

అంతకుముందు చియాన్ విక్రమ్ వర్మ హీరోయిన్ గురించి నవంబర్ 12వ తేదీన మధ్యాహ్నం ఒక ప్రకటన చేస్తాం అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ కోసం ఓ ప్రకటనను జారీ చేయడంతో సోషల్ మీడియా జామ్ ప్యాక్ అయింది.

వర్మ ఫస్ట్‌లుక్‌కు మంచి క్రేజ్

వర్మ ఫస్ట్‌లుక్‌కు మంచి క్రేజ్

ఇదిలా ఉండగా, నవంబర్ 10న రీలీజ్ చేసిన వర్మ ఫస్ట్‌లుక్ విశేష స్పందన వస్తున్నది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అయిపోయింది. విక్రమ్ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. యూ ఆర్ గాడ్ డామిన్ రైట్ అని ట్యాగ్ లైన్‌ను పెట్టి తన ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశాడు.

English summary
The hunting for heroine of Dhruv Vikram starrer Varma has started. Chiyaan Vikram tweeted that she is missing. If you are her or anyone who looks like her, send your pics or videos to varmathemoviegmail.com. Vikram tweet has became viral in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu