twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak: పుష్ప అనుభవంతో ముందే మేల్కొన్న పోలీసులు.. వెళ్లాలంటే ఇలా చేయాల్సిందే!

    |

    'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ బుధవారం నాడు జరగబోతోంది. గతంలో ఇదే ప్రదేశంలో జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎదురైన అనుభవాల దృష్ట్యా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేవారి కోసం పోలీసులు కీలక నిబంధనలు పెట్టారు. ఆ వివరాలు..

    వాయిదా

    వాయిదా

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' అనేక వాయిదాల అనంతరం ఫిబ్రవరి 25వ తేదీన విడుదలకు సిద్ధమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న హైదరాబాద్, యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరగబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 21న అంటే సోమవారం జరగాల్సిన ఈ కార్యక్రమం ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా బుధవారానికి వాయిదా పడింది.

    పుష్ప వేడుక అనుభవంతో

    పుష్ప వేడుక అనుభవంతో


    గతంలో ఇదే స్థలంలో జరిగిన 'పుష్ప' వేడుకలో గొడవలు, తొక్కిసలాటలు వంటివి జరగడంతో ఈసారి అలాంటివి జరగకుండా నివారించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని ముఖ్య అతిథులుగా వస్తుండటంతో పోలీసులు ముందుగానే ఈ విషయంలో రంగం లోకి దిగారు. ఈ మేరకు కొన్ని నిబంధనలను విడుదల చేశారు. ఈవెంట్‌కి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాల్సిందిగా కోరారు.

    పాసులు ఉన్నవారికి మాత్రమే

    పాసులు ఉన్నవారికి మాత్రమే

    కేవలం పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. పాసులు లేకుండా వచ్చి గుంపులు కట్టడానికి అనుమతి లేదని, ఫిబ్రవరి 21 అని ఉన్న పాసులు చెల్లవని పేర్కొన్నారు కొత్తగా ఇచ్చిన పాసులు ఉన్నవారినే అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే వాహనాలన్నింటికి పార్కింగ్ సౌకర్యం కల్పించడం కష్టంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి.. వ్యక్తిగత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా ఈవెంట్‌కి రావాల్సిందిగా కోరుతున్నామని పేర్కొన్నారు.

    ట్రాఫిక్ మళ్లింపు

    ట్రాఫిక్ మళ్లింపు

    అంతేకాక యూసుఫ్‌గూడ వైపుగా వెళ్లే వాహనదారులు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవడం మంచిదనీ పేర్కొన్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి.. ముందుగానే వేరు మార్గం చూసుకోవాలని పేర్కొన్నారు. అయితే పోలీసులు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మీద కూడా అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ట్రాఫిక్ మళ్ళించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.

    Recommended Video

    Bheemla Nayak Pre Release : KTR For Pawan Kalyan's Event | Filmibeat Telugu

    అందుకే


    అయితే గతంలో పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా పోలీసులు ఈ మేరకు అనేక చర్యలు తీసుకుంటున్నారు.. అదీకాక రాష్ట్రమంత్రులు ఇద్దరూ ఈ ఈవెంట్కు హాజరు కాబోతున్న క్రమంలో ఏం జరిగినా అది పోలీసులకు పెద్ద మచ్చగా మిగిలిపోతుందని భావిస్తున్నారు. అందుకే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఫ్యాన్స్ అంతగానే ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ ఈవెంట్ కు బండ్లగణేష్ వస్తారా రారా అనే విషయం మీద కూడా చర్చ సాగుతోంది.

    English summary
    Hyderabad police set rules and regulations for people attending Bheemla Nayak pre release event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X