»   » 2016 మోస్ట్ డిజైరబుల్ మెన్ నెం 1 ఊహించగలరా?? ... మహేష్ 2, ఎన్టీఆర్ 5 ప్రభాస్ 6, నాగచైతన్య 7

2016 మోస్ట్ డిజైరబుల్ మెన్ నెం 1 ఊహించగలరా?? ... మహేష్ 2, ఎన్టీఆర్ 5 ప్రభాస్ 6, నాగచైతన్య 7

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేషనల్ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వే ఫలితాలు రిలీజ్ చేసారు. 2011నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో స్థానం సంపాదిస్తూ ఉండడంతో ఈ లిస్ట్‌పై తెలుగు ప్రజల్లోనూ ఆసక్తి కనిపిస్తూ వచ్చింది.

ఇక 2013లో మహేష్ బాబు ఏకంగా నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించడంతో మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌నే తెచ్చుకుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన 25 మందితో కూడిన ఈలిస్టులో అనేక సర్ప్రైజ్ లు ఉన్నాయి. అయితే ఈ సారి మొదటి సర్ప్రైజ్ మాత్రం మహేష్ అభిమానులకి కాస్త నిరాశ కలిగించేదే.

ఎందుకంటే ఈ సంవత్సరం ప్రిన్స్ మళ్ళీ ఇక స్థానం తగ్గాడు. 2015లో ఈ జాబితాలో టాప్ ప్లేస్ మహేష్ బాబుదే. ఈ ఏడాది ఆ ప్లేస్ ని రోహిత్ లాగేసుకున్నాడు. ఇంతకీ ఈ రోహిత్ ఎవరంటే 2016 జూలై 19న ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన ఫైనల్స్‌లో.. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాలకు చెందిన ఫైనలిస్ట్‌లతో పోటీపడి.. హైదరాబాద్‌కు చెందిన రోహిత్ ఖండేల్వాల్ (26) మిస్టర్ వరల్డ్-2016 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

Hyderabad times most desirable men 2016 telugu

పురుషుల మోడలింగ్ ప్రపంచంలో ఇప్పటిదాకా భారత్‌కు దక్కిన మిస్టర్ వరల్డ్ టైటిల్ ఇదే. అవార్డుతో పాటు 50 వేల అమెరికన్ డాలర్ల నగదు బహుమతి రోహిత్ అందుకున్నాడు. ఇలా ర్యాంక్ కోల్పోవడం.. తిరిగి సంపాదించడం మహేష్ కి కొత్తేమీ కాదు. 2012.. 2013ల్లో మోస్డ్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో.. మహేష్ బాబు విన్నర్ 2014 లో మళ్ళీ తగ్గింది. 2015 లో తన స్థానాన్ని తాను మళ్ళీ సంపాదించాడు.

2014 లో కూడా మహేష్ రెండో స్థానం తో సరిపెట్టుకోవల్సి వచ్చింది. అప్పుడు మొదటి స్థానం లో రానా నిలిచాడు. అయితే మళ్ళీ 2015 లో రానాను వెనక్కి నెట్టి మహేష్ బాబు నెం.1 పొజిషన్ దక్కించుకోగా రానా కేవలం 5వ స్థానానికి మాత్రమే పరిమితం అయిపోయాడు. అదేవిధంగా 'బాహుబలి' తో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ తన గత సంవత్సరం 3వ స్థానం నుండి పడిపోయి 4వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

అయితే అందరికీ షాక్ ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ లేకపోయినా జూనియర్ 2వస్థానంలోను అల్లుఅర్జున్ 3వ స్థానంలోను ఈసారి టైమ్స్ సర్వేలో స్థానాలు పొందటం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 2011నుంచే సూపర్ స్టార్ మహేష్ దేశవ్యాప్తంగా టాప్ 5 లిస్ట్‌లో ఉంటున్నాడు. ఇక అదే విధంగా హైద్రాబాద్ టైమ్స్ లిస్ట్‌లోనూ మహేష్ టాప్‌లోనే ఉంటూ వస్తున్నాడు. ఈ సంవత్సరం ఇంకా విశేషం ఏమిటంటే మూడో స్థానం లో నేచురల్ స్టార్ నాని ఉండగా రానా నాలుగో ప్లేస్ లోకి మారాడు. జూనియర్ ఎన్టీఆర్ 5 ప్రభాస్ 6, నాగచైతన్య 7 ల్లో నిలిచారు.. ఈ జాబితా ఓసారి చూసేయండి మరి..

English summary
the 27-year-old 'Badichowdi boy' managed to pip a bevy of Tollywood heart-throbs to be voted as the Hyderabad Times Most Desirable Man 2016. In a chat with Hyderabad Times, Rohit shares his excitement.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu