For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సానియా మీర్జా జీవితం ఆధారంగా రెండు చిత్రాలు

  By Srikanya
  |
  డిల్లీ: సానియా మీర్జా జీవితం ఆధారంగా త్వరలో బాలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కనుంది . ఈ చిత్రంలో ప్రధానపాత్రను దేబినా బెనర్జీ పోషించనుంది. ఈమె ఒక ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారమైన 'రామాయణ్‌' ధారావాహికలో సీత పాత్రను బుల్లితెరపై పోషించింది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు.చిత్రానికి 'హైదరాబాద్‌ దామాద్‌' (హైదరాబాద్‌ అల్లుడు)అని పేరుపెట్టనున్నారు.

  కానీ తన జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కనున్నట్లు తెలియదని సానియా మీర్జా అనడం కొసమెరుపు. ఈ విషయం గురించి దేబినా మాట్లాడుతూ 'సానియా మీర్జా జీవితానికి ఈ చిత్రం కాపీ కాదని, కేవలం ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్ర కథ తయారయిందని' అంటోంది.

  మరో ప్రక్క ఇషా డియోల్‌ ముఖ్యపాత్రలో సానియా మీర్జా నిజ జీవితాన్నే 'ఐ ఫర్‌ ఇండియా' పేరుతో మరో చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. మన దేశానికి చెందిన అబ్రెల్లా ఫిల్మ్స్‌, లాస్‌ ఏంజెలెస్‌లోని డిస్టెంట్‌ హారిజోన్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి దర్శకుడు హేమంత్‌ దేశాయ్‌.

  ఆటతోనే కాకుండా వ్యక్తిగత జీవితంతోనూ నిత్యం వార్తల్లో నిలిచే క్రీడాకారిణి సానియా మీర్జా. మన దేశంలో కేవలం పురుషులకే పరిమితమైన టెన్నిస్‌ క్రీడలో మగువలు ఏ మాత్రం తీసిపోరని ఆరంగేట్రంతోనే అంతర్జాతీయంగా చాటి చెప్పిన ఘనత ఈమెది. నేటితరం యువతికి ప్రతినిధిగా నిలిచే సానియా చేసే ప్రతి పనీ ఒక సంచలనమే.క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న ఆమె నిజజీవితంలో ఆటకు సంబంధించిన గెలుపోటములు మాత్రమే కాకుండా ఒక సినిమాకు కావాల్సిన అన్ని మలుపులు ఉన్నాయి.

  నవరసాలు సమ్మిళితమై ఉన్న జీవితం సానియాది. సంప్రదాయ ఇస్లాం కుటుంబంలో జన్మించినా టెన్నిస్‌ ఆటనే ప్రాణంగా ప్రేమించి చిన్నతనం నుంచీ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఆటను కొనసాగించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పిన్నవయసులోనే అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది. ఆటకు సంబంధించి ఆమె ధరించే దుస్తులపై ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. తనను విమర్శించిన వారందరికీ ఆటతోనే ధీటుగా సమాధానమిచ్చింది. చిన్ననాటి స్నేహితుడితో నిశ్చితార్ధం జరిగిన తరువాత తాను పాకిస్థాన్‌ క్రికెట్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకుని దుబాయ్‌లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంది.

  ఒక ఇంటిదైనా టెన్నిస్‌ ఆటను కొనసాగిస్తూనే ఉంది. అప్పుడప్పుడూ ర్యాంపులపై 'పిల్లి'నడకలు నడుస్తూ ఫ్యాషన్‌ ప్రపంచంలోకి ప్రవేశించింది. ఇటీవలే ఒక ప్రముఖ టీవీలో ప్రసారమైన రియాలిటీ డాన్స్‌ షోలో తన భర్తతో కలిసి అడుగులు కలిపి ఆకట్టుకుంది. క్రీడారంగంలో వివక్షత ఎదుర్కొన్న ప్రతిసారీ తన అభిప్రాయాలను ఎంతో నిర్భయంగా వెల్లడించింది. తన అభిప్రాయాలతో పలుమార్లు సంచలనం సృష్టించింది. ఆమె హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేస్తుందని పలుమార్లు పుకార్లు వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు. సానియాపైనే చిత్రం రూపుదిద్దుకోవడం అభిమానులకు శుభవార్తే. మరో ప్రక్క బాక్సింగ్‌ క్రీడాకారిణి మేరీకోమ్‌ జీవితం ఆధారంగా నిర్మిస్తున్న చిత్రంలో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.

  English summary
  
 Tennis beauty Sania Mirza might be happy that she put full stop to all gossips and rumours with her marriage, but she couldn’t stop people peeping into her personal life. Bollywood producer PD Garg is making a Hindi film on Sania Mirza’s controversial life story. Jaya Shankar will be directing this movie. Want to know who is playing Sania’s role in this film? Bengali beauty Debina Benarjee who plays Goddess ‘Sita’ role in Ramayan tele serial, will play Sania’s role in this film. Bollywood actor Ali Merchant is zeroed upon to play Sania’s husband Shoyab Mallik’s role. Although, not yet confirmed TV artist Amar Upadyay may be roped in for playing Shohrab Mirza’s role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X