»   » హైపర్... ట్రైలర్ వచ్చేసింది, ఇది చూస్తే సినిమా అర్థమైపోతుంది!

హైపర్... ట్రైలర్ వచ్చేసింది, ఇది చూస్తే సినిమా అర్థమైపోతుంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, కందిరీగ ఫేం డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). జిబ్రాన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోను ఇప్పటికే వారానికో పాట చొప్పున విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది.

సుకుమార్‌, హరీష్‌ శంకర్‌, నాని హైపర్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో హైపర్ సినిమాలోని పాటలను ప్రదర్శించారు. సుకుమార్‌ మాట్లాడుతూ - ''ట్రైలర్‌ సూపర్బ్‌, అదిరిపోయింది. కొన్నిసార్లు ట్రైలర్‌ చూస్తేనే సినిమాపై పాజిటివ్‌ వైబ్స్‌ వస్తుంది. ఈ ట్రైలర్ అలాగే ఉందన్నారు. రామ్ చాలా హైపర్‌. జగడం నుండి హైపర్‌ వరకు రామ్‌లో ఏ చేంజ్‌ లేదు. ఈ సినిమా తప్పకుండా రామ్‌ హిట్‌ కొడతాడు.'' అన్నారు.

దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ - '' రామ్‌తో ఎలాంటి కథతో సినిమా చేయాలో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మాకు మూడు నెలలు పట్టింది. కమర్షియల్‌ సినిమాల స్టయిల్‌లో కాకుండా ఏదో చెప్పాలి, దాంట్లో ఓ నిజాయితీ ఉండాలని రాసుకున్న కథే హైపర్‌. ప్రతి ఒకరికి వారి తండ్రే హీరో. ఈ సినిమాలో హీరోకు కూడా తండ్రే హీరో. తండ్రిని గెలిపించే కథే హైపర్‌. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా సక్సెస్‌ తర్వాత నేను సినిమా గురించి మాట్లాడుతాను. నా కెరీర్‌లో, నేను చేసిన మూడు సినిమాల్లో ఇదే బెస్ట్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

Hyper

రామ్‌ మాట్లాడుతూ - ''దర్శకుడు సంతోష్‌ నాకెంటే హైపర్‌. సినిమా స్టార్ట్‌ చేసిన మూడు నెలలకే పూర్తి చేసేశాడు. కందిరీగ కథ నాకు చెప్పినప్పుడు తను పెద్ద డైరెక్టర్‌ అవుతాడనిపించింది. ఈ కథ చెప్పేటప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. మా కాంబినేషన్‌లో సూపర్‌హిట్‌ అవుతుంది. నిర్మాతలు చాలా ప్యాషనేట్‌. వారి ప్యాషన్‌ ప్రతి సినిమాకు పెరుగుతుంది. నాకొక మరో హోం బ్యానర్‌లా అనిపిస్తుంది. సమీర్‌రెడ్డి ప్రతి సీన్‌ను ఎంతో అద్భుతంగా చూపించారు. చాలా కమిట్‌మెంట్‌ ఉన్న వ్యక్తి. జిబ్రాన్‌ చాలా మంచి ఆల్బమ్‌ ఇచ్చాడు. అలాగే అబ్బూరిరవిగారు ఎంతో సహకారం అందించారు. సెప్టెంబర్‌ 30న హైపర్‌ విడుదలవుతుంది'' అన్నారు.

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయినపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

English summary
Hyper (Prathi Intlo Okaduntaadu) Movie Theatrical trailer is out for you here. This launch happened at Audio Launch Grand Live Event is happening today at JRC function hall Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu