»   »  హైపర్ ‘రిపబ్లిక్’యాక్షన్: జాతీయ జెండాతో రామ్

హైపర్ ‘రిపబ్లిక్’యాక్షన్: జాతీయ జెండాతో రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువతరం హీరోలలో దేశభక్తి పాలు ఎక్కువగానే కనిపిస్తున్నది. గతంలో పంద్రాగస్టు, రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని అల్లు అర్జున్ తోపాటు పలువురు హీరోలు దేశభక్తిని చాటుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా హైపర్ స్టార్ రామ్ జాతీయ జెండా పట్టుకొని దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని చిరునవ్వులు చిందిస్తున్న రామ్ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటున్నది.

Hyper star Ram with National Flag

అయితే తన ఫేస్ బుక్ పేజీలో దీనికి సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించకపోవడం గమనార్హం. ఈ ఫోటో సినిమా షూటింగ్ లో భాగంగా తీసిందా లేక రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని దిగారా అనే విషయం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. అభిమానుల్లో రేకెత్తుతున్న సందేహానికి రామ్ సమాధానమిస్తారో వేచి చూడాల్సిందే.

నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని చిరునవ్వులు చిందిస్తున్న రామ్ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటున్నది.

English summary
Hyper star Ram Republic day josh with National Flag
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu