»   » నేను దొంగని, అబద్దాల కోరుని: దర్శకుడు రాజమౌళి తండ్రి కామెంట్

నేను దొంగని, అబద్దాల కోరుని: దర్శకుడు రాజమౌళి తండ్రి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి, భజరంగీ భాయిజాన్ సినిమాలకు కథ అందించిన ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.... ఆ రెండు సినిమాలు దాదాపుగా ఒకే సమయంలో విడుదలై భారీ విజయం సాధించడంతో ఆయన ఇండియా వైడ్ ఫేమస్ అయిపోయాడు. అదే సమయంలో ఆయన స్టోరీలు కాపీ వివాదాల్లోనూ ఇరుక్కున్నాయి. ఇటీవల భజరంగీ భాయిజాన్ కూడా అలాంటి వివాదంలో ఇరుక్కుంది.

ఇటీవల ఓ ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ తనపై వస్తున్న విమర్శకులు డిఫరెంటుగా సమాధానం ఇచ్చారు. నేను దొంగను...అదే సమయంలో అబద్దాల కోరును కూడా అంటూ తన గురించి తానే ఆయన సంచలన కామెంట్ చేసారు. తనపై తాను అలా కామెంట్ చేసుకోవడానికి కారణం కూడా చెప్పారు.

I am a liar and a thief: Vijayendra Prasad

''నేను దొంగని అని ఎందుకు అంటున్నానంటే.. కొంతమంది ఐడియాలను పరిగణనలోకి తీసుకుని, కథలు రాస్తాను. కానీ, నా టాలెంట్ నేను తక్కువ చేయలేను. ఇటీవల నేను రాసిన 'భజరంగీ భాయ్ జాన్' కథను తీసుకుందాం. ఇరవయ్యేళ్ల క్రితం చిరంజీవి చేసిన పసివడి ప్రాణం చిత్రంలో పిల్లవాడు మూగవాడు. తల్లిదండ్రులు హత్యకు గురైంది కళ్లారా చూస్తాడు. ఆ పిల్లవాణ్ణి చిరంజీవి కాపాడతాడు. ఇప్పుడు ఇలాంటి కథతో సినిమా తీస్తే బాగుంటుందనుకున్నప్పుడు నా అసిస్టెంట్ దానికి పాకిస్తాన్ కనెక్షన్ ఉంటే బాగుంటుందన్నాడు. అలా తయారు చేసిందే 'బజరంగీ భాయ్ జాన్'. సో.. ఐడియా వచ్చింది చిరంజీవి సినిమావల్లనే అని చెప్పాకు.

అదే విధంగా నేను సమయం, సందర్భాన్ని బట్టి అబ్బదాలు కూడా ఆడతాను. 'నా గాళ్ ఫ్రెండ్స్ అందరికీ 'నువ్వే అందమైన అమ్మాయివి' అని చెబుతుంటాను. ఆ సమయంలో అలా చెప్పాలనిపించి చెప్పేస్తాను. కానీ, అది అబద్ధం'' అని అంటూ తనను తాను సమర్థించుకున్నారు విజయేంద్రప్రసాద్.

English summary
"I enjoy creating a story. It gives me pleasure, whatever money I make is just a bonus. Sometimes I wonder why they are paying me so much money. Also I must admit that first of all I am a liar and second I am a thief. But I take pride in my talent so that the other person should not be aware that I am stealing anything." Vijayendra Prasad said.
Please Wait while comments are loading...