»   » మగవాడితో కనిపిస్తే .. పడుకున్నావా అని అడుగుతున్నారు!

మగవాడితో కనిపిస్తే .. పడుకున్నావా అని అడుగుతున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలతో విసిగిపోయాననని ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ అన్నారు. తన ఆత్మకథ 'ఆన్ అన్‌సూటబుల్ బాయ్' తర్వాత మీడియా వేధింపులు ఎక్కువయ్యాయని ఆయన పేర్కొన్నారు. దాంతో మగవాళ్లతో బయటకు వెళ్లాలంటే భయమేస్తున్నదని ఇటీవల మీడియాతో తన బాధను పంచుకొన్నారు.

పురుషుడితో కనిపిస్తే సంబంధాలు అంటగడుతున్నారు..

పురుషుడితో కనిపిస్తే సంబంధాలు అంటగడుతున్నారు..

తన ఆత్మకథలో కొన్ని వాస్తవాలను వెల్లడించిన తర్వాత తన పరిస్థితి దారుణంగా తయారైందని కరణ్ వెల్లడించారు. బయట ఏ వ్యక్తితోనైనా కనిపిస్తే ఆ వ్యక్తితో సంబంధం అంటగడుతున్నారని ఆయన అన్నారు. దాంతో పరిస్థితి చాలా దుర్భరంగా మారిందని తెలిపారు.

అతడితో పడుకుంటున్నావా అడుగుతున్నారు..

అతడితో పడుకుంటున్నావా అడుగుతున్నారు..

ఎవరితోనైనా డిన్నర్‌కు వెళితే మీడియా వెంటపడుతున్నదని, జీవితంలో వ్యక్తిగత స్వేచ్ఛ కరువైందని కరణ్ తన బాధను వెళ్గగక్కారు. ఏ వ్యక్తితోనైనా డిన్నర్‌కు వెళితే అతడితో పడుకొంటున్నావా అని ఫొటో జర్నలిస్టులు అడుగుతున్నారని ఆయన తెలిపారు. ఇద్దరు పురుషులు డిన్నర్‌కు వెళితే తప్పా అని ప్రశ్నించారు.

కాజోల్ గురించి ఏదో అన్నానని అజయ్ తిట్టాడు..

కాజోల్ గురించి ఏదో అన్నానని అజయ్ తిట్టాడు..

‘ఒకరోజు నాకు కాల్ చేసి ఇష్టం ఉన్నట్టు అరిచారు. ఓ పార్టీలో ఆయన భార్య కాజోల్ గురించి ఏదో అన్నానని మండిపడ్డారు. ఆయన నోటి నుంచి వినకూడని మాటలు విన్నాను. ఫొన్ ఎత్తగానే మాట్లడనివ్వకుండా దుర్భాషలాడటం సరికాదు. ఏదైనా ఉంటే ఎదుటి వ్యక్తి చెప్పుకోవడానికి కూడా అవకాశమివ్వాలి' అని కరణ్ జోహర్ అన్నాడు.

అజయ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు

అజయ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు

తనపై కాజోల్ భర్త అజయ్ దేవగన్ చేసిన ఆరోపణలు ఖండించారు. అజయ్ నటించిన శివయ్ చిత్రం బాగాలేదని ప్రచారం చేయడానికి సినీ విమర్శకుడికి డబ్బులు ముట్టజెప్పానని చెప్పడంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. పాకిస్థాన్ నటుడు ఫవద్ ఖాన్‌ను తన చిత్రంలో తీసుకోవడం తలెత్తిన వివాదంపై స్పందించాడు.

నాపై కూడా దాడి జరుగొచ్చు..

నాపై కూడా దాడి జరుగొచ్చు..

పద్మావతి చిత్ర షూటింగ్‌లో సంజయ్ లీలా భన్సాలీపై దాడిని ఖండించారు. ఎంత ధైర్యముంటే సెట్లోకి వచ్చి దాడి చేస్తారని నిలదీశాడు. ఆ దాడి తనపై జరిగినట్టే భావించానని అన్నారు. రేపటి రోజున తనపై కూడా అలాంటి దాడి జరిగే అవకాశముందని కరణ్ ఆందోళన వ్యక్తం చేశాడు.

English summary
Karan Johar has said he is he is now "afraid" to go out even with a "man" friend. paparazzi reaches everywhere and if you go out for dinner with a man, you’re sleeping with him. Because two men can’t be out for dinner just as friends,” Karan said
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu