»   » వేరే హీరోని తన భర్తలో ఊహించుకున్న మంచు విష్ణు భార్య

వేరే హీరోని తన భర్తలో ఊహించుకున్న మంచు విష్ణు భార్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్ ఇటీవల నటించిన చిత్రం దబంగ్. ఈ సినిమా బాలీవుడ్ లో బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కోడుతుంది. ఈ సినిమాని మంచు విష్ణువర్దన్ భార్య వెరోనికా చూడడం జరిగింది. ఈ సినిమా చూస్తున్న సేపు ఆమె తన్మయత్వానికి లోనయ్యారంట. దానికి కారణం ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ చాలా బాగా నటించారని, ఆయన్ని చూస్తున్న సేపు ఆ పాత్రలో తన భర్త మంచు విష్ణుని ఆ పాత్రలో ఊహించుకున్నారట. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ చేసిన పాత్ర తన భర్త విష్ణు చేస్తే చాలా బాగుంటుందని, తన భర్త అలాంటి పాత్రలే చేయ్యాలని తాను కోరుకుంటానని ఆమె తన ట్విట్టర్ లో పేర్కోనడం జరిగింది. మరి మన మంచు విష్ణు భార్య సలహా మేరకు అలాంటి పాత్రలే త్వరలోనే చేస్తాడని అనుకుంటున్నారు. అంతే కాకుండా ముచ్చటైన వీరి మధ్య మంచి అనురాగ, అప్యాయతలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. చివరగా దబంగ్ సినిమా చాలా బాగుందని అమె వెల్లడించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu