»   » ఆమె కి సరైనోడు దొరకటం లేదట: డైరెక్టర్లకు ఆఫరిస్తోన్న ఆలియా

ఆమె కి సరైనోడు దొరకటం లేదట: డైరెక్టర్లకు ఆఫరిస్తోన్న ఆలియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

"హైవే" లో ఆలియా భట్ నటనని చూసిన వారంతా ఆశ్చర్య పోయారు. ఒక అద్బుతాన్ని చూసినట్టూ చూస్తూండిపోయారు. ఆలియా చూపిన పెర్ఫార్మెన్స్ కి అంతా ఫిదా అయిపోయారు. అయితే మళ్ళీ ఆస్థాయి నటన చూపించలేకపోయింది ఆలియా.... అయితే అది తన తప్పు కాదేమో. సరైన స్కోప్ ఉన్న పాత్రలు తనకు లభించక పోవటం వల్లనే అన్న విశయం ఉడ్తా పంజాబ్ చూస్తే అర్థమై పోతుంది....

ఈమధ్య వార్తల్లో ఉన్న పిక్చర్ ఉడ్తా పంజాబ్. ఆ సినిమాలో అలియా నటననను అందరూ మెచ్చుకున్నారు. సోనమ్ కపూర్ అయితే అలియాకు నేషనల్ అవార్డ్ ఇవ్వాల్సిందేనని చెప్పింది. గ్లామర్ గా కనిపించే ఈ పిల్ల డీ గ్లామర్ రోల్ నే చేసింది. ఆ కేరక్టర్ లో జీవించింది.

నటనలో ఎవరి టాలెంట్ అయినా తెలియాలంటే...డీ గ్లామర్ రోల్స్ బాగా ఉపడయోగపడతాయి. ఎమోషన్స్ ఎక్కువగా ఉండే కేరక్టర్స్ లో నటించడం తనకు ఇష్టమని చెప్పింది అలియా. తెర మీద పింకీ పాత్రలో కనిపించిన ఆలియా మరో సారి తన సత్తా ఏమిటో చూపించింది. మామూలుగా ఒక పిచ్చిపిల్లలా ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆలియా భట్ కెమెరా ముందు తనని నటిగా వాడుకునే దర్శకుడికి తనెలాంటి ఔట్ పుట్ ఇవ్వగలదో మరో సారి నిరూపించుకుంది.

 Alia Bhatt

ప్రతి పాత్ర తనకు ఛాలెంజ్ లాంటిదే అని, డైరెక్టర్లు తనను మంచి దారిలో నడిపించాలని, అప్పుడే తనలోని నటన బయటకు వస్తుందని చెప్పింది అలియా. నటనలో తనకు ఆకాశమే హద్దని, తను డైరెక్టర్స్ చెప్పినట్టు చేసే నటిని అని చెప్పింది ఈ బాలీవుడ్ భామ.

"ఇక ముందు కూడా ఇలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నారా?" అని అడిగితే... అది డైరెక్టర్ల మీద ఆధార పడి ఉంది వారేం కోరుకుంటారో అది మాత్రమే నేనివ్వగలను. సో..! ఇప్పుడు నాకు సరైన దైరెక్టర్ కావాలి" అని బదులిచ్చింది.

English summary
"I think each character is different for me, but I am a director's actor. So if I get the right vision and right guidance from my director, I think sky is the limit for me," says Alia bhatt
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu