»   » మేమిద్దరం ఒకటే..మా అభిరుచులూ ఒక్కటే...!?

మేమిద్దరం ఒకటే..మా అభిరుచులూ ఒక్కటే...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మనసు అసిన్‌ పై పడిందా..? అసిన్‌ ను సల్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నాడా...? అసలు అసిన్ అంటే సల్మాన్‌ కు ఎందుకంత పిచ్చి ప్రేమ..? అనే ప్రశ్నలపై ఇపుడు బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయో లేదో కానీ సల్మాన్ మాత్రం అసిన్ తన డ్రీమ్ గాళ్ అని చెప్పేశాడు ఆ మద్యన ఓ ఇంటర్వ్యూలో.

దక్షిణాదిన అవకాశాలు పూర్తిగా కరువైన మలయాళీ భామ అసిన్ బాలీవుడ్‌ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అమీర్‌ఖాన్ సరసన 'గజిని" చిత్రంతో బాలీవుడ్‌ కు ఈ సుందరి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కొన్ని చిత్రాలు నిరాశపరిచినా ఇటీవల సల్మాన్‌ తో జతగా నటించిన 'రెడీ" సక్సెస్ సాధించడంతో కొత్త ఉత్సాహంతో వుంది ఈ సుందరి.

అంతేకాదు ఇదే అదనుగా సల్మాన్‌ ను ఆకాశానికెత్తేస్తోంది. ఆయనలో తనలాగే నిజాయితీ వుందని, ఇద్దరం ఓపెన్‌ మైండ్‌ తో వుంటామని అందుకే ఇద్దరి అభిరుచులు బాగా కలిశాయంటోంది. 'ఎప్పుడు ఫోన్ చేసినా సల్మాన్ నాకు అందుబాటులో వుంటాడు. నన్ను వారి కుటుంబ సభ్యురాలిగా భావిస్తాడు. మేమిద్దం ఎక్కువగా కలుసుకోలేకపోయిన మంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నాం. మా ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటే. బాలీవుడ్‌ లో నాకు అత్యంత ఆత్మీయమైన వ్యక్తి సల్మాన్" అని చెప్పుకొచ్చింది ఈ భామ. హిందీలో బిజీగా వున్నా తన మూలాల్ని ఎప్పుడూ మరచిపోనని, దక్షిణాది సినిమారంగం అంటే తనకెంతో అభిమానమని అంటోంది. ప్రస్తుతం అసిన్ బాలీవుడ్‌ లో 'హౌస్‌ ఫుల్, బోల్‌బచ్చన్" చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Honestly, every single day I receive an offer from Malayalam, Tamil or Telugu cinema. And it is not a conscious decision to go away from the South. Somewhere I am very attached to my roots. I know that it's the Southern film industries that have made me an actor and that is where people relate to me the most.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu