»   » ఇప్పుడు అతడితో అఫైర్ లేదు.. విడిపోయిన తర్వాతే ఆ బాధ తప్పింది.. హెబ్బాపటేల్

ఇప్పుడు అతడితో అఫైర్ లేదు.. విడిపోయిన తర్వాతే ఆ బాధ తప్పింది.. హెబ్బాపటేల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కుమారి 21 ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించింది అందాల తార హెబ్బా పటేల్. తర్వాత ఆమె నటించిన ఈడో రకం, ఆడో రకం, ఎక్కడికి పోతావే చిన్నదానా, నాన్నా నేను నా భాయ్ ఫ్రెండ్, మిస్టర్ చిత్రాల్లో మంచి నటనతో ఆమె ఆకట్టుకొన్నది. స్టార్ హీరోయిన్‌గా మారిన హెబ్బా తన వ్యక్తిగత, సినీ జీవిత విషయాలను ఇటీవల మీడియాతో పంచుకొన్నారు.

అతడితో బ్రేకప్..

అతడితో బ్రేకప్..

సినిమా పరిశ్రమలో రూమర్లు చాలా వేగంగా దూసుకెళ్తాయి. లేని విషయాలను మరీ పెద్దగా చేసి కథలు కథలుగా రాస్తారు. ఓ వ్యక్తితో ఆఫైర్ ఉన్నది నిజమే. ఆ వ్యక్తి గురించి చెప్పను. ప్రస్తుతం అతడికి నాకు ఎలాంటి రిలేషన్స్ లేవు. అతడితో రిలేషన్ వల్ల చాలా విషయాలు తెలుసుకొన్నాను. ప్రస్తుతం నేను ఇలా ఉన్నానంటే అతనే కారణం అని హెబ్బా చెప్పింది.

ఆ బాధ తప్పింది..

ఆ బాధ తప్పింది..

తనతో విడిపోయిన తర్వాత లవ్, మ్యారేజ్ అనే విషయాల గురించి ఆలోచించే బాధ తప్పింది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాను. ఈ విషయం నా కుటుంబానికి కూడా తెలుసు అని కుమారి హెబ్బా చెప్పింది.

రాజ్ తరుణ్‌తో గొడవలు లేవు..

రాజ్ తరుణ్‌తో గొడవలు లేవు..

హీరో రాజ్ తరుణ్‌తో అసలు గొడవలు లేవు. అతడు నాకు మంచి స్నేహితుడు. అఫైర్ ఉందని వచ్చిన వార్తలు కేవలం రూమర్ మాత్రమే. రెండు మూడు సినిమాలు చేసినంత మాత్రాన సంబంధం అంటగడుతున్నారు. అది సరికాదు. ఓ వ్యక్తితో క్లోజ్‌గా ఉన్నంత మాత్రన అఫైర్ అవుతుందా అని ఆమె అన్నారు.

ఆ కారణంగానే కుదర్లేదు..

ఆ కారణంగానే కుదర్లేదు..

రాజ్ తరుణ్‌తో ఓ ఫ్యాషన్ షోలో పాల్గోనాల్సి ఉంది. కానీ వీలుకాకపోవడంతో నేను కలిసి చేయనని రాజ్‌కు చెప్పాను. నా పరిస్థితి చూసిన ఆయన అర్థం చేసుకొన్నారు. మా మధ్య జరిగిన సంభాషణ గురించి తెలియని వాళ్లు మా మధ్య విబేధాలు ఉన్నాయని రూమర్లు పుట్టించారు.

ఎవరికి తోచినట్టు వాళ్లు..

ఎవరికి తోచినట్టు వాళ్లు..

విభేదాల కారణంగానే రాజ్‌తరుణ్‌తో కలిసి ర్యాంప్‌ వాక్‌ చేయలేదని పుకారు పుట్టించారు. ఆ తర్వాత తనతో కలిసి ఓ సినిమాలో నటించాను. దాంతో మా మధ్య విబేధాలు సమసిపోయాయని వారే అన్నారు. ఎవరికి తోచినట్టు వారు అనుకుంటే నాకేమన్న సంబంధం ఉంటుందా అని హెబ్బా అన్నారు.

English summary
Actress Hebba Patel now leading heroine in tollywood. She grabing opportunities regularly. She share her personal affairs with media recently. She said I had breakup from a relations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu