»   »  చిరంజీవి అండగా ఉన్నారు, మరిచిపోలేను: మహేష్

చిరంజీవి అండగా ఉన్నారు, మరిచిపోలేను: మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ స్టార్స్ చిరంజీవితో హిందీలో జెంటిల్మెన్, నాగార్జునలతో జఖ్మ్ సినిమా చేసాను. చిరంజీవి మేలు ఎప్పటికీ మరిచిపోలేను. జెంటిల్‌మెన్ సినిమా తీసినప్పుడు నా దగ్గర డబ్బులేమి లేవు. అయినా చిరంజీవిగారు అంగీకరించారు. ఈరోజు కోట్లాది వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఉండొచ్చు. కానీ చిరుతో సినిమాని రీమేక్ చేసినప్పుడు మహేష్ భట్ పూర్తిగా అప్పుల్లో ఉన్నాడు. ఆ విషయంలో చిరంజీవి చేసిన సహకారానికి ఆయన పట్ల ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటానను అని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ తెలిపారు.

I am grateful to Chiranjeevi: Mahesh Bhatt

థియేటర్ ఆర్ట్స్ కు సంబంధించిన విషయమై మహేష్ భట్ ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... థియేటర్ ఆర్ట్స్‌ను సినిమాను వేరుచేసి చూడలేం. ప్రస్తుతం సినిమాలో విజయం సాధించి ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖులంతా ఒకప్పుడు స్టేజీ డ్రామాల్లో పాల్గొన్నవారే అన్నారు.

I am grateful to Chiranjeevi: Mahesh Bhatt

షబానా అజ్మి, నందితాదాస్, రాధిక ఆప్టే, కిరణ్‌ఖేర్, ప్రకాష్‌రాజ్, మనోజ్‌భాజ్‌పాయ్, ఓంపూరి, అనుపమ్ ఖేర్, నసిరుద్దీన్‌షా, షఫీ ఇలా ఎందరో ఆర్టిస్టులు. అదే తెలుగుకు వచ్చే సరికి ఎన్టీఆర్, నాగేశ్వరరావు, చిరంజీవి వంటి పాతతరం నటీనటులంతా వెండితెరపై ఓ వెలుగు వెలిగినవారేనని అన్నారు.

English summary
“As far as Hyderabad is concerned, I had long back directed Tollywood actors Chiranjeevi and Nagarjuna in the films The Gentleman and Zakhm respectively. In fact I owe a lot of gratitude to Chiranjeevi for having agreed to act in my film at a time when there was hardly any financial support and he graciously donned the role.” Mahesh Bhatt said.
Please Wait while comments are loading...