»   » తెలుగు సినిమాల స్టామినా కూడా చాలా అద్భుతంగా ఉంది: షారుక్

తెలుగు సినిమాల స్టామినా కూడా చాలా అద్భుతంగా ఉంది: షారుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినీ పరిశ్రమ పై బాలీవుడ్ నటులు కన్నేయడం సర్వసాధారణం అయ్యింది. తమ సినిమాల్ని తెలుగు లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడమో.. లేకుంటే, తెలుగు సినిమాల్లో నటించాలనే ఆసక్తి వ్యక్త పరచడమో ఈ మధ్య బాలీవుడ్ నటీ నటులనుంచి కన్పిస్తోంది. తాజాగా, తెలుగు సినీ పరిశ్రమ పై తానూ మనసు పారేసుకున్నానని ప్రకటించాడు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.

తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ కి దీటుగా ఎదుగుతోందనీ, దక్షినాది లో టాలీవుడ్ ఇప్పుడు మేజర్ సినిమా ఇందుస్త్రీగా ఎదిగిందని షారుక్ కితాబిచ్చాడు. 'మగధీర' సహా కొన్ని తెలుగు సినిమాలు ఈ మధ్యాకాలం లో తాను చూశాననీ, టెక్నికల్ యాంగిల్ లో చూస్తే టాలీవుడ్ ఇప్పుడు అద్భుతమైన సినిమాలకు వేదికయ్యిందని షారుక్ అభిప్రాయపడ్డాడు. తనవరకు తానూ తెలుగు సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఉన్నానని షారుక్ ప్రకటించడం గమనార్హం.

అయితే, షారుక్ ని తెలుగు సినిమాల్లో నటిమ్పజేయాలంటే అదేమీ అంత చిన్న విషయం కాదు.. తక్కువలో తక్కువ రెండు కోట్లయినా షారుక్ కి చూపించందే అతిధి పాత్రకు షారుక్ ఒప్పుకోదన్నది నిర్వివాదాంశం. అన్నట్టు, ఇక పై తాను హీరోగా వచ్చే సినిమాల్ని తెలుగులోకి డబ్బింగ్ చేయించి మరీ, ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయిస్తానని అంటున్నాడు షారుఖ్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu