»   » 'వయాగ్రా' లా మగాళ్ళలో కోరికలు పుట్టిస్తానంటోంది

'వయాగ్రా' లా మగాళ్ళలో కోరికలు పుట్టిస్తానంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

మగాళ్ళలో కోరికలు పుట్టించటానికి వయాగ్రాలాంటి మందును ఆశ్రయిస్తున్నప్పుడు నా సినిమాలు కూడా అదే పని చేస్తున్నాయి. వాటిని మాత్రం సమాజం ఎందుకు ప్రమోట్ చేయదు అని ప్రశ్నిస్తోంది మల్లికా షెరావత్. వయాగ్రా వేసుకోవటం వల్ల కలిగే ఫలితం లాంటిదే తను చేసే సినిమాల వల్ల కూడా కలుగుతుందని ఆమె చెపుతోంది. అలాగే తాను చేసే సినిమాలు చూసి తన క్యారెక్టర్ గురించి రకరకాలుగా అనుకుంటారని, అటువంటి విచ్చలవిడి జీవితం తనకు లేదని, తను చాలా పద్దతిగా సంప్రదాయంగా ఉంటానని, చివరకు పార్టీలకు కూడా వెళ్ళనని, సిగెరెట్ కాల్చటం, మాసం తినటం వంటివి కూడా నిషేధం అని చెప్తోంది. అలాగే తనకు తన శరీరం అంటే చాలా ఇష్టమని, తనకు పేరు, డబ్బు తెచ్చి పెట్టిన ఈ శరీరంకు రుణపడి ఉంటానని, అందుకే ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే క్రమంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక తనకు సెక్సీ ఇమేజ్ అంటే చాలా ఇష్టమని, అది తెచ్చుకోలేని వారే అది మంచిది కాదని వాదిస్తూంటారని ఆమె వివరించింది. ఇక తన తాజా చిత్రం 'హిస్" తన కెరీర్ లో ఓ ప్రత్యేకమైన చిత్రం అని అంది. ఇక ప్లాప్ లు అనేవి కెరీర్ లో కామన్ అని, వాటిని పట్టించుకుంటూ వెళ్తే ముందుకు సాగలేమని, కేవలం వాటినుంచి పాఠాలు నేర్చుకోవటానికే తప్పులను వినియోగించుకోవాలని చెప్తోంది. మంచి ఆలోచనలే కదా..కొనసాగనివ్వమందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu