»   » కమలినీ ముఖర్జీ నన్ను పోలుస్తున్నారు

కమలినీ ముఖర్జీ నన్ను పోలుస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏమాయ చేసావె' హీరోయిన్ గా చేసిన సమంత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాటల్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మీడియాలో మాట్లాడుతూ...తనను అందరూ కమిలినీ ముఖర్జీతో పోలుస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయమై మాట్లాడుతూ...ఈ సినిమా చూశాక నన్ను చాలామంది కమలినీ ముఖర్జీతో పోల్చి చెబుతున్నారు. ఇప్పుడే కాదు..కాలేజీలో కూడా అలాగే అనేవారు. ఇప్పుడు నన్ను నేను పరీక్షగా చూసుకుంటుంటే నిజమేనేమో అనిపిస్తోంది. అలాగే 'ఏమాయ చేసావె'లో ఎక్కువగా చీరలు, చుడీదారుల్లో కనిపించా. జెస్సీ పాత్రకు అలాంటి డ్రస్సులు బాగుంటాయంటే వేసుకున్నా అది కొంత కారణమై ఉండవచ్చు. మీరు గమనించారో, లేదో..అందులో నేను మేకప్ లేకుండానే చేశా. బయట మాత్రం నేను మోడ్రన్ డ్రస్సుల్లోనే కనిపిస్తాను అంటోంది. ఇక తను నాగచైతన్యతో చేసిన ముద్దులు గురించి చెబుతూ...చైతన్యలో మంచి ఎనర్జీ ఉంది. ముద్దుసీన్లంటారా...అవి వ్యక్తిగతమైనవి కాదుకదా. కథానుసారం గౌతమ్ మీనన్ చెప్పినట్లు చేశామంతే అంటోంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu