»   » కేసీఆర్... రివర్స్‌గా ఆర్‌సి‌కె సినిమా తీస్తా: రామ్ గోపాల్ వర్మ

కేసీఆర్... రివర్స్‌గా ఆర్‌సి‌కె సినిమా తీస్తా: రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ జీవితం మీద మధుర శ్రీధర్ రెడ్డి సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే కేసీఆర్ మీద తాను కూడా సినిమా చేస్తున్నట్లు వివాదాస్పద దర్శకుడు వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, జీవిత కథలు తీయడంలో వర్మ టాలెంట్ అందరికీ తెలిసిందే. ఇలాంటివి వర్మ కాస్త వివాదాస్పదంగా, తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారు. అయితే కేసీఆర్ సినిమా విషయంలో వర్మ చేసిన ప్రకటన కాస్త చిత్రంగానే ఉంది... ఆ సినిమాను కేసీఆర్ అని కాకుండా ఆర్.సి.కె అని తీస్తాడట.

ఆర్‌సి‌కె సినిమా

నేను ఆర్‌సి‌కె సినిమా తీస్తున్నాను. ఇందులో కేసీఆర్ గురించి చాలా మందికి తెలియని విషయాలు చెప్పబోతున్నాను అని వర్మ తెలిపారు.

స్ట్రైట్‌గా కేసీఆర్‌లో చూడని యాంగిల్‌

ఆర్‌సీకే మూవీ అసలు సిసలైన కేసీఆర్ గురించి చెబుతుంది. మనకు స్ట్రైట్ గా ఉండే కేసీఆర్ తెలుసు, కానీ ఈ సినిమా ఆయనలో జనాలకు తెలియని రివర్స్ కోణం చూపెట్టబోతున్నాను అని వర్మ తెలిపారు.

వ్యక్తిత్వం గురించి కాదు, తన మైండ్‌లో ఉన్నది చూపిస్తా

ఆర్‌సీకే సినిమా కేసీఆర్ బయటి వ్యక్తిత్వం కాకుండా.. తన మైండ్‌లో ఉన్నదానిని సినిమాగా చూపిస్తానని వర్మ ట్వీట్ చేసారు.

కేసీఆర్ లోపల ఉండే వ్యక్తినే హైలెట్ చేస్తా

ఈ సినిమాలో కేసీఆర్ లోపల ఉండే వ్యక్తినే హైలైట్ చేస్తాను అని వర్మ తెలిపారు.

బ్రూస్ లీ, దీపిక

కేసీఆర్... దీపిక పదుకోన్ లాంటి అందం కలగలిపిన తెలంగాణ బ్రూస్ లీ. అదే విధంగా పొలిటికల్ గా అందం లేని వాడు అని వర్మ కామెంట్ చేసారు.

English summary
"I am making a film called RCK the reverse of what one doesn't know about KCR" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu