»   » డ్రగ్స్ గొడవతో పార్టీ ప్లేసు మార్చిన తెలుగు హీరోలు

డ్రగ్స్ గొడవతో పార్టీ ప్లేసు మార్చిన తెలుగు హీరోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ సోదరులు రఘు,భరత్ లు డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడటం తెలుగు హీరోలను బాగానే భయపెట్టిందంటున్నారు. ఇంతకు ముందు సాయింత్రం ఎనిమిది దాటితే పబ్ లలో ,నైట్ క్లబ్ లలో కనపడే వీరంతా ఇప్పుడు అస్సలు అటు వైపే చూడటం లేదని సమాచారం. ముఖ్యంగా అల్లు అర్జున్, నవదీప్, శర్వానంద్, ముమైత్ ఖాన్, రానా వంటి రెగ్యులర్ నైట్ లైఫ్ బ్యాచ్ అస్సలు అటు వైపుకే చూడటం లేదని, ఏదన్నా పార్టీ అనుకుంటే గెస్ట్ హౌస్ లాంటి చోట ఎరేంజ్ చేసుకుని పరిమితంగా ఉండే తమ సర్కిల్ వారితో ఎంజాయ్ చేస్తున్నారని చెప్తున్నారు.

ఈ విషయమై ముమైత్ ఖాన్ మాట్లాడుతూ...ఇంతకు ముందులా ఇండస్ట్రీకి సంభందించిన నా ప్రెండ్స్ ఎవరూ క్లబ్స్ కు రావటం లేదు..దాంతో ప్రీక్వెంట్ గా వెళ్ళే నేను కూడా మానేసాను. గతంలోలా పార్టీలు జరగటం లేదు. జరిగినా హాజరవ్వటానికి ఎవ్వరూ ఆసక్తి చూపటం లేదంటోంది. దానికి కారణం..పబ్ ఓనర్స్ చెబుతూ..ఏ అర్ధ్రరాత్రో తమకు సమాచారం అందిందంటూ నార్కోటిక్స్ ఆఫీషియల్స్ వచ్చి డ్రగ్స్ కోసం చెకింగ్ మొదలెడుతున్నారు. దాంతో కష్టమర్స్ అవమానంగా ఫీలవుతున్నారు. అలాగని నార్కోటిక్స్ డిపార్టమెంట్ వారిని ఆపలేము. ఈ క్రమంలో మాకు కష్టమర్స్ దూరమైపోతున్నారు. మా వ్యాపారం దెబ్బతింటోంది. నిజాయితీగా చేసే వాళ్ళు కూడా ఇబ్బందులు పడాల్సిన సిట్యువేషన్ ఏర్పడింది అంటున్నారు.

ఇక ఇప్పుడు డైరక్టర్స్ ఆఫీసులో రాత్రి దాటాక నైట్ క్లబ్స్ గా మారుతున్నాయి. హీరో,హీరోయిన్స్ అక్కడికి రావటానికి ఏ సంకోచమూ చూపటం లేదు. అలాగే ఆ సమయంలో సినిమా ఆఫీసులకు మీడియావారు కూడా రారు..కాబట్టి ఎక్సపోజర్ ఉండదని హ్యాపీ ఫీలవుతున్నారు. ఇదే విషయమై ఆవకాయ బిర్యాని ఫేమ్ బిందు మాధవి మాట్లాడుతూ..డ్రగ్స్ కేసు బయిట పడ్డప్పుడు నేను సిటీలో లేను. అయినా చక్కగా పార్టీని ఏ ప్రెండ్ ఇంట్లోనో, లేదా డీసెంట్ గా ఉండే రెస్టారెంట్ లో పెట్టుకుంటే బెటర్..మన ఇమేజ్ కు ఏ డామేజీ రాదు..నేను మాత్రం పార్టీలకు మానలేదు. ఎందుకంటే నేను క్లీన్ అని నాకు తెలుసు అంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu