డబుల్ రోల్ వార్తలు అవాస్తవం.. గోపిచంద్ క్లారిటీ..
దర్శకుడు సంపత్ నంది రూపొందిస్తున్న గౌతమ్‌నంద చిత్రంలో తాను ద్విపాత్రాభినయం చేయడం లేదని హీరో గోపిచంద్ వివరణ ఇచ్చారు. ఈ చిత్రం షూటింగ్ పనులు చివరి దశకు చేరుకొన్నాయి.
దర్శకుడు సంపత్ నంది రూపొందిస్తున్న గౌతమ్‌నంద చిత్రంలో తాను ద్విపాత్రాభినయం చేయడం లేదని హీరో గోపిచంద్ వివరణ ఇచ్చారు. ఈ చిత్రం షూటింగ్ పనులు చివరి దశకు చేరుకొన్నాయి. శరవేగంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

గౌతమ్‌నంద సినిమాపై ధీమాను వ్యక్తం చేసిన గోపిచంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. కాకపోతే రెండు విభిన్నమైన పాత్రలు ఉంటాయి. కథ రెండు కోణాల్లో సాగుతుంది అని అన్నారు. ఈ చిత్రంలో హన్సిక, కేథరిన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా, మిగితా పాత్రల్లో సచిన్ కేద్కకర్, ముఖేశ్ రుషి ఇతర పాత్రల్లో కనిపిస్తారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై పుల్లారావు, భగవాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
gautam nanda gopichand sampath nandi hansika catherine గౌతమ్ నందా గోపిచంద్ సంపత్ నంది హన్సిక క్యాథరిన్


Click it and Unblock the Notifications