twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాపై అసూయతోనే దుష్ర్పచారం : ఎమ్మెస్ నారాయణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : నా మీద దుష్ర్పచారం చేస్తున్నవారి పేర్లు అనవసరం. అసూయతో ప్రచారం చేస్తుంటారు. అవన్నీ పట్టించుకోను. మనం గొప్పవాళ్లమైతేనే ఎదుటివాళ్లకు అసూయ కలుగుతుంది. అలాగే ఎప్పుడైతే మన గురించి అలా లేనిది ప్రచారం చేస్తున్నారో అప్పుడు వాళ్లు మనకు భయపడుతున్నట్లే లెక్క. నేనెప్పుడూ నా గురించి ఆలోచిస్తాను. ఎదుటివాడి గురించి అస్సలు ఆలోచించను అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ కమిడెయన్ ఎమ్మెస్ నారాయణ.సినిమాలో త్రాగుబోతు పాత్రలకు పెట్టింది పేరుగా మారిన ఆయన పూర్తి త్రాగుబోతు అనే టాక్ ఇండస్ట్రీలో ఉందే. ఈ విషయమై చెప్తూ... ఇలా స్పందించారు.

    అలాగే మందు నాకు హాని కాదు. నా లైఫ్‌ని తీసుకుందాం. షూటింగ్స్ కారణంగా రెస్ట్‌లెస్‌గా ఉంటాను. ఆ అలసట పోగొట్టుకోవడానికి చిన్న పెగ్ తీసుకుని, హాయిగా నిద్రపోతాను. దానివల్ల నాకు ఎనర్జీ వస్తుందే తప్ప, జీవితం నాశనం అయిపోయే రేంజ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఆరోగ్యాన్ని పాడు చేసే చీప్ లిక్కర్ జోలికి వెళ్లను. చాలామంది ప్రచారం చేస్తున్నట్లుగా నేను బీభత్సమైన తాగుబోతుని కాదు అన్నారు.

    MS Narayana

    ఇక మందు కొట్టే పాత్రలను అద్భుతంగా పండిస్తారు. నిజంగా అలవాటుంది కాబట్టే.. అంతలా పండిస్తున్నారని అనుకుంటారు. కానీ రియల్ లైఫ్ అలవాటుకీ దానికీ సంబంధం లేదు. ఎందుకంటే, నిజజీవితంలో అలవాటుంది కాబట్టే.. బాగా చేస్తున్నానని అంటే, మరి ఆ పాత్రలు చేసేటప్పుడు తాగి నటించాలిగా. నేనలా చేయను. రవిరాజాగారు ఫస్ట్ తాగుబోతు పాత్ర ఇచ్చినప్పుడు, అసలు తాగినవాడు నత్తిగానే ఎందుకు మాట్లాడాలి? కిక్కుండాలి.. నత్తి ఉండకూడదని మంచి డిక్షన్‌తో డైలాగ్ చెప్పాను. ఆ మాడ్యులేషన్‌లో ఓ స్వీట్‌నెస్ ఉంటుంది. అది ప్రేక్షకులకు నచ్చింది. నేను చేసే తాగుబోతు పాత్రలు సక్సెస్ అవ్వడానికి కారణం, ఆ పాత్ర మర్డర్లు, మానభంగాలు చేయదు, దుష్ట పనులేవీ చేయదు. నవ్విస్తుంది. అందుకే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు.

    'దుబాయ్ శీను' సినిమాలో సాల్మన్ రాజు పాత్రకు ఓ పెద్ద నటుణ్ణి అనుకరించిన విషయం గురించి చెప్తూ... ఓ ఆర్టిస్ట్‌గా దర్శకుడు ఏం చెబితే అది చేయడమే నా బాధ్యత. ఆ స్టార్ ఎంతో ఫేమస్ అయితేనే దర్శకుడు పేరడీ చేయిస్తాడు. అయినా ఆ పేరడీలు వివాదం అవుతాయనుకోలేదు. ఎందుకంటే, అవన్నీ కామెడీ కోసమే అని వివరించారు.

    English summary
    Comedian MS Narayana said ..."My drunkard roles have been a big hit because those characters doesn't do any anti-social activities, but only tickles the funny bones of the audience. Alcohol has never done any harm to me. For example, take my life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X