»   » డ్రగ్ రాకెట్: తన పేరు రావడంపై షాకైన తెలుగు హీరో

డ్రగ్ రాకెట్: తన పేరు రావడంపై షాకైన తెలుగు హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు గతంలో డ్రగ్స్ రాకెట్లో పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత, దర్శకుడు సుశాంత్ రెడ్డితో పాటు పలువురు నైజీరియన్లు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే తెలుగు యంగ్ హీరో, ప్రముఖ సింగర్ గీతా మాధురి భర్త అయిన నందు కూడా ఈ డ్రగ్స్ రాకెట్లో ఉన్నట్లు ఓ టీవీ ఛానల్ లో వార్తలొచ్చాయి.

ఈ వార్తలతో షాకైన నందూ వెంటనే వివరణ ఇచ్చారు. టీవీ ఛానల్‌ను ఆశ్రయించిన నందు తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు ఈ కేసులో తన పేరు ప్రస్తావించక పోయినా నాపై ఇలాంటి వార్తలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేసారు. నిర్మాత సుశాంత్ రెడ్డి అరెస్టయినపుడు తాను ఆ పరిసరాల్లో కూడా లేనని, మీడియా వారు సెన్సేషన్ కోసం తన పేరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

'I am not involved in drug racket': Tollywood actor Nandu

నేను ఈ కేసులో ఉన్నట్లు, అజ్ఞాతంలో వెళ్లినట్లు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నన్ను పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న నాపై వార్తలు వేసారు. ఇదంతా పూర్తిగా అబద్దం. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. కావాలంటే నాకు పరీక్షలు చేసి నిరూపించుకోండి అని స్పష్టం చేసారు. గతంలో నాని పై, వరుణ్ సందేశ్ పై కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. వారికి డ్రగ్స్ తో సంబంధం లేదని నిరూపించుకున్నారు. నేను కూడా నన్ను నేను నిరూపించుకునేందుకే మీడియా ముందుకు వచ్చాను అని స్పష్టం చేసారు.

సుశాంత్ రెడ్డి నాకు పరిచయమే, అతనితో కలిసి పని చేసాను...కానీ అతను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు, అతనికి ఇలాంటి అలవాట్లు ఉన్నట్లు, అతని పర్సనల్ లైఫ్ గురించి నాకు తెలియదు అని నందు స్పష్టం చేసారు. డ్రగ్స్ కేసులతో సినీ పరిశ్రమకు లింకు పెట్టొద్దు. ఒక వేళ ఎవరికైనా అలవాట్లు ఉంటే వారి వ్యక్తిగతం. కానీ ఇలాంటివి లింక్ చేసి సినీ పరిశ్రమకు చెడ్డపేరు తేవద్దు అని స్పష్టం చేసారు.

English summary
"The NEWS telecasted about me on few TV channels is completely False and just a Rumour . .I'm not involved in any wrong things that is shown on TV. .I'm very much available in hyderabad to the Media & Press" Nandu said.
Please Wait while comments are loading...