For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావటం లేదు: ఒక్కసారి షాక్ ఇచ్చేసిన రజినీకాంత్

  |
  ఒక్కసారిగా షాక్ ఇచ్చిన రజినీకాంత్

  గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ప్రహసనం, జయలలిత మరణం తో ఊపందుకున్న ఊహాగానాలకు ఒకే సారి తెర దించేసాడు రజినీ కాంత్. ఇక తమిళ రాజకీయాల్లోకి రజినీ రాక అన్న పదం ఉత్తదే అని తేల్చేసాడు. మీరు చదువుతున్నది నిజమే స్వయంగా రజినీ కాత్ చెప్పిన మాటలే ఇవి. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన పెట్టుకోలేదని స్పష్టం చేసాడు రజినీ కాంత్...

   ఆయ‌న ఎలా చెప్తే అలా న‌డుచుకుంటా

  ఆయ‌న ఎలా చెప్తే అలా న‌డుచుకుంటా

  ''ఆ దేవుడు శాసిస్తాడు.. ఈ అరుణాచ‌లం పాటిస్తాడు. ర‌జినీకాంత్ హిట్ సినిమా అరుణాచ‌లంలో సూప‌ర్ హిట్ డైలాగ్ ఇది. స‌రిగ్గా ఇలాగే త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై కూడా ''ఆ దేవుడే నిర్ణ‌యిస్తాడు. ఆయ‌న ఎలా చెప్తే అలా న‌డుచుకుంటా'' అని ఏ విష‌యం తేల్చ‌కుండా నాన్చుతూ వ‌చ్చిన సూప‌ర్‌స్టార్ అభిమానుల‌తో స‌మావేశంలో..

   దేశం భ్ర‌ష్టుప‌ట్టిపోయింది

  దేశం భ్ర‌ష్టుప‌ట్టిపోయింది

  నువ్వు త‌మిళుడివి కాదు మా రాష్ట్రం విడిచి వెళ్లిపో అన్నార‌ని, కానీ నేను ప‌క్కా త‌మిళుడినే అంటూ చేసిన ప్రసంగం దాదాపుగా ఒక పూర్తి స్థాయి రాజకీయ ప్రసంగాన్నే తలపించింది. మ‌రోవైపు దేశ రాజ‌కీయాల‌పై కూడా ర‌జినీ ఆసక్తికర వ్యాఖ్య‌లే చేశాడు. రాజ‌కీయాలు అధ్వాన్నంగా త‌యార‌య్యాయ‌ని, దేశం భ్ర‌ష్టుప‌ట్టిపోయింద‌ని, దీన్నిమార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ప్ర‌జ‌ల్లో కూడా మార్పు రావాల‌ని ఇలా చాలానే చెప్పాడు.

   ఏది నిజమో ఏది అబద్దమో

  ఏది నిజమో ఏది అబద్దమో

  ఇక ఆ తర్వాతనుండీ ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కానన్ని వార్తలు. రజినీ బీజేపీలో చేరుతాడనీ లేదు సొంత పార్టీ పెడుతున్నాడనీ వచ్చిన వార్తలతో బాటు.., కమల్ హాసన్ తో కూడా గొడవలు, సవాళ్ళూ, వెటకారాలూ అయ్యాయి... తీరా ఇక్కడి దాకా వచ్చాక ఇప్పుడు అంతా ఉత్తుత్తినే... అంటూ చేతులెత్తేసాడు..

  పుట్టిన రోజు సందర్భంగా

  పుట్టిన రోజు సందర్భంగా

  తాను ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 12న రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలను రజనీ ఖండించారు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తిలేదన్నారు.

   గోవా రాజధాని పనాజిలో

  గోవా రాజధాని పనాజిలో

  ఈ మేరకు బుధవారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తన నిర్ణయానికి గల కారణాలపై కూడా వివరణ ఇచ్చుకున్నాడు. గోవా రాజధాని పనాజిలో ప్రారంభమైన అంతర్జాతీయ 45వ ఫిలిం ఫెస్టివల్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ జాతీయ మీడియా సంస్థ రజినీని ప్రత్యేకంగా ఇంటర్య్వూ చేసింది.

  ఆసక్తి లేదు

  ఆసక్తి లేదు

  రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు అని ప్రశ్నించగా.., ‘నాకు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి లేదు' అని రజినీ సమాధానం చెప్పాడు. అలాగని రాజకీయాలంటే భయమనుకోవద్దన్నారు. పాలిటిక్స్ లోకి వస్తే ప్రజా సేవ చేస్తాను అనే నమ్మకం పూర్తిగా లేదన్నారు. కాబట్టి రాజకీయాల్లోకి రావాలి అనుకోవటం లేదని చెప్పాడు.

  స్వచ్ఛమైన ప్రజా సేవ

  స్వచ్ఛమైన ప్రజా సేవ

  ఇక ఇప్పటికే తనను పొలిటికల్ ఎంట్రీపై చాలా పార్టీలు సంప్రదించాయని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో అనిశ్చితి నెలకొందనీ.., ఏ పార్టీ కూడా పూర్తిగా స్వచ్ఛమైన ప్రజా సేవ చేయటం లేదని రజినీకాంత్ అభిప్రాయపడుతున్నారు. తమిళ సూపర్ స్టార్ ను చేర్చుకోవాలని బీజేపీ, చాలాకాలంగా ప్రయత్నిస్తోంది.

   రజినీ బీజేపీలో చేరితే

  రజినీ బీజేపీలో చేరితే

  స్వయంగా అమిత్ షా వంటి అగ్రనేతలు రంగంలోకి దిగి చర్చలు జరిపారు. రజినీ బీజేపీలో చేరితే తమిళనాట ఎక్కడో ఉన్న కమలం ఒక్కసారిగా వికసించటం ఖాయమనే నమ్మకంతో పార్టీలోకి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు.

   మరోమారు అభిమానులతో సమావేశమవుతా

  మరోమారు అభిమానులతో సమావేశమవుతా

  రజినికాంత్ మాత్రం రాజకీయాల్లోకి వస్తే కలిగే ఇబ్బందులు, విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. 2.0 చిత్రం విడుదల తర్వాత తాను మరోమారు అభిమానులతో సమావేశమవుతానని పేర్కొన్నారు. అయితే ఆ సమావేశం కూడా రాజకీయ ప్రవేశం గురించి కాదన్నారు.

  English summary
  Will he or won't he? Superstar Rajinikanth, often asked if he was going to take the plunge into politics, has said he won't - not yet, that is.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X