twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ బాక్సర్ మేరీ కోమ్ ప్రేరణతో కాజల్ పాత్ర

    By Srikanya
    |

    హైదరాబాద్: గజనీ, స్టాలిన్, సెవెన్త్ సెన్స్ చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తాజా చిత్రం 'తుపాకి'. విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్ 9న దీపావళికి విడుదల అవుతోంది. ఈ చిత్రంలో కాజల్ పాత్ర అదిరిపోతుందని చెప్తున్నారు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత... ప్రముఖ భారత క్రీడాకారిణి మేరీ కోమ్ ప్రేరణతో ఈ పాత్రను రూపొందించారు. ఈ చిత్రంలో ఆమె భాక్సర్ గా కనిపించనుంది. ఈ విషయమై మీడియాతో ఆమె మాట్లాడుతూ... "నేను ఈ చిత్రంలో భాక్సర్ గా కనిపిస్తాను. ఆ ఎక్సపీరియన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నన్ను నేను భాక్సర్ గా తెర మీద చూసుకోవటం చాలా ఆనందపరిచే విషయం. ," అంది. అలాగే తాను ఈ పాత్ర కోసం రీసెర్చ్ కూడా చేసానంటోంది.

    "ముఖ్యంగా భాక్సర్ గా కనిపించటానికి నా శరీరాన్ని మరింత ఫిట్ గా ఉంచుకున్నాను. అలాగే నేను ఒలింపిక్ ఛాంపియన్ మోరీ కోమ్ ప్రేరణతో చేసాను. ఆమె వీడియోలు చాలా చూసాను. ఆమె బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసాను. ఆమెను నేను ఈ చిత్రంలో అనుకరించాను. అలాగే నేను కాలేజీ రోజుల్లో భాక్సింగ్ నేర్చుకున్నాను. అది నాకు బాగా ఉపచయోగపడింది. అయితే ప్రొఫిషినల్ భాక్సర్ గా కనిపించటానికి మాత్రం కాస్త కష్టపడ్డాను " అంది.

    'తుప్పాక్కి'లో తొలిసారిగా విజయ్ స్కైప్‌ హెయిర్‌స్త్టెల్‌లో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా గాగూల్స్‌తో యువతను ఆకట్టుకుంటున్నాడు. చేతిలో గన్‌ పట్టినా అందంగా కనిపిస్తూ అలరిస్తున్నాడు. అంతేకాకుండా చిత్ర ట్రైలర్‌లో కనిపించిన అతని మాటలు కూడా నేటి ట్రెండ్‌ను స్పష్టం చేస్తున్నాయి. గత రెండు దఫాల్లోనూ విజయం సాధించిన విజయ్‌.. ఇప్పటి స్త్టెల్‌తో మరెన్ని విజయాలు సాధిస్తారో వేచి చూడాల్సిందే అంటున్నారు అభిమానులు.

    విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ వ్యయంతో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీర్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

    ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్‌ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. గత నాలుగు నెలల నుంచీ ఈ చిత్రం టైటిల్ పై వివాదం కొనసాగింది. రీసెంట్ గా ఈ టైటిల్ వివాదం రాజీకొచ్చి విడుదలకు సిద్దమవుతోంది. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్‌కున్న క్రేజ్‌, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ భారీగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జైరాజ్, కెమెరా: సంతోష్ శివన్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్.

    English summary
    After playing a brave princess in ‘Magadheera’, Kajal is all set to showcase her fiery side once again in the upcoming Kollywood film, ‘Thupakki’. “I am playing a boxer in the film and it has been an exciting experience,” says the actor who had to do some research for the role. “I drew inspiration from Olympic champion Mary Kom and watched a few of her bouts to observe her body language, agility and postures to get my act right” she adds.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X