విలన్ పాత్రలు చేయడానికి సిద్ధం: ఆదిత్య ఓం
అక్టోబర్ 5న నటుడు ఆదిత్య ఓం పుట్టిరోజు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.తెలుగులో ఇంకా విభిన్నమైన పాత్రలు చేయాలనుందన్నారు.విలన్ రోల్స్ చేయడానికి కూడా తాను సిద్ధమే అన్నారు.
'లాహరి లాహరి లాహరిలో' సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయిన ఆదిత్య ఓం తర్వాత హీరోగా తెలుగులో చాలా సినిమాలు చేసినా నిలదొక్కుకోలేక పోయాడు. తర్వాత స్వీయ దర్శకత్వంలో 'ఫ్రెండ్ రిక్వెస్ట్' అనే సినిమా చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.
ప్రస్తుతం హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ లాగిస్తోన్న ఆదిత్య ఓం..... ఇకపై విలన్ పాత్రలు చేయాలని డిసైడ్ అయ్యారు. అక్టోబర్ 5న తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని మాటను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆదిత్య ఓం మాట్లాడుతూ... దశాబ్దన్నర కాలంగా తనను ఆదరించిన తెలుగు ఆడియన్స్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై విలన్ రోల్స్ కూడా చేయడానికి తాను సిద్ధమే అని, తెలుగులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉందని తెలిపారు.

తన మొదటి సినిమా 'లాహిరి లాహిరి లాహిరిలో' దగ్గర నుండి ఇటీవల తాను చేసిన 'ఫ్రెండ్ రిక్వెస్ట్' సినిమా వరకు ప్రేక్షకులు తనను ఆదరించి, వారి గుండెల్లో తనకు చోటు ఇచ్చినందుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











