»   » 30 కోట్లు పెట్టి రిస్కు చేసా, PPTపై మోహన్ బాబు

30 కోట్లు పెట్టి రిస్కు చేసా, PPTపై మోహన్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏ విషయాన్నయినా ముక్కుసూటిగా మాట్లాడే నటుడు, నిర్మాత మోహన్ బాబు....తాజాగా తన ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'పాండవులు పాండవులు తుమ్మెుద' గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమాపై 30 కోట్లు ఖర్చు పెట్టామని, మార్కెట్ పరంగా చూసుకుంటే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం రిస్కే అని మోహన్ బాబు అభిప్రాయ పడ్డారు.

'సినిమాను ఏపీలో నేనే సొంతగా విలీజ్ చేసుకుంటున్నాను. సినిమాకు దాదాపు 20 కోట్ల వరకు బిజినెస్ ఆఫర్లు వచ్చాయి. కొందరు నాన్-రీఫండబుల్ బేసిస్‌లో సినిమాను తీసుకుంటామని చెప్పారు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. నేను ఈ పరిశ్రమ ద్వారానే డబ్బు సంపాదించాను. ఇలాంటి చోట డబ్బుతో గ్యాంబ్లింగ్ చేయడం నాకు ఇష్టం లేదు. సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

సినిమా వివరాల్లోకి వెళితే...తాజాగా 'పాండవులు పాండవులు తుమ్ముద' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. జనవరి 31న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు టూరిస్ట్ గైడ్ గా కనిపించనున్నారని చెప్తున్నారు.

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

English summary
“I am taking a big risk with Pandavulu Pandavulu Thummedha. We spent 30 Crores on the movie and I am releasing this film on my own across the state." Mohan Babu said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu